CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదల, ఆదాయ వనరుల పెంపు, ఎక్సైజ్, జీఎస్టీ సంస్కరణలపై చర్చించారు.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదల, ఆదాయ వనరుల పెంపు, ఎక్సైజ్, జీఎస్టీ సంస్కరణలపై చర్చించారు. రాష్ట్ర ఖజానాకు రాబడిని పెంచుతూ, వ్యాపారాలకు అనుకూల వాతావరణాన్ని కల్పించే మార్గాలపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగుపరిచేలా విధానపరమైన చర్యలపై అరవింద్ సుబ్రమణియన్ సూచనలు అందించినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలపైనా చర్చ జరిగింది. సమావేశంలో సీఎం సలహాదారు కే రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కమర్షియల్ టాక్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు
- ●HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..
- ●'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?
- ●Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
- ●POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు
- ●Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ

Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు

HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..

'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?

Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు





