త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kirankumar Reddy | ప్ర‌జా స‌మ‌స్య‌ల పరిష్కార వేదికే ‘సీఎం ప్ర‌జావాణి’: ఎంపీ చామ‌ల ప్ర‌శంస‌

MP Chamala Kirankumar Reddy | సీఎం ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఒక మంచి వేదిక అని, సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

S

Telangana | Published On Jun 19, 2026, 2.48 pm IST

MP Chamala Kirankumar Reddy | ప్ర‌జా స‌మ‌స్య‌ల పరిష్కార వేదికే ‘సీఎం ప్ర‌జావాణి’: ఎంపీ చామ‌ల ప్ర‌శంస‌
Advertisement

MP Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఒక మంచి వేదిక అని, సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్ద‌న్నారు. త్వ‌రిత‌గతిన స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం ప్రవాసీ ప్రజావాణి ఆహ్వానం మేర‌కు జ్యోతిభాపూలే ప్రజా భవన్‌లో శుక్ర‌వారం నిర్వ‌హించిన ప్ర‌జావాణిని సందర్శించి అన్ని శాఖల నోడల్ అధికారులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గ్రీవియన్స్ ల గురించి అడిగి తెలుసుకున్నారు.

సీఎం ప్రవాసీ ప్రజావాణికి ఇంత గుర్తింపు రావడం సంతోష‌క‌ర‌మ‌న్నారు. గల్ఫ్ దేశాల్లో మన తెలంగాణ ప్రవాసీయులు దుర్దృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం ఏ రాష్ట్రంలో లేద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రవాసీయుల పట్ల ఉన్న బాధ్యత, ప్రేమకు ఇది నిదర్శనం అని కొనియాడారు. ప్రజలు సమర్పించిన ఫిర్యాదులు, వినతులపై పూర్తి వివరాలను సేకరించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు ఆయా సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జి.చిన్నా రెడ్డి, ఎన్ఆర్ఐ అడ్వైసరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్ రెడ్డి, ఎన్ఆర్ఐ కమిటీ మెంబర్ నంగి దేవేందర్ రెడ్డి ఉన్నారు. త్వ‌రిత‌గతిన స్పందించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని సూచించారు.

Advertisement
Advertisement