త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana University | తెలంగాణ వర్సిటీలో ఉద్రిక్త‌త‌.. సీనియ‌ర్‌, జూనియ‌ర్ విద్యార్థుల మ‌ధ్య ఘర్షణ 

Telangana University | కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) స్వ‌ల్ప‌ ఉద్రిక్త‌త చోటుచేసుకున్న‌ది. హోలీ సంబురాల అనంత‌రం వ‌ర్సిటీ క్యాంప‌స్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ త‌లెత్తింది.

G

Telangana | Published On Mar 4, 2026, 8.40 am IST

Telangana University | తెలంగాణ వర్సిటీలో ఉద్రిక్త‌త‌.. సీనియ‌ర్‌, జూనియ‌ర్ విద్యార్థుల మ‌ధ్య ఘర్షణ 
Advertisement

Telangana University | త్రినేత్ర‌.న్యూస్‌: కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) స్వ‌ల్ప‌ ఉద్రిక్త‌త చోటుచేసుకున్న‌ది. హోలీ సంబురాల అనంత‌రం వ‌ర్సిటీ క్యాంప‌స్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ త‌లెత్తింది. దీంతో రెండు గ్రూపులు ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్నాయి.

మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీ సౌత్‌ క్యాంపస్ హాస్ట‌ల్‌లో.. హోలీ సంబరాల అనంతరం సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇరు వ‌ర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. దీంతో పలువురు గాయప‌డ్డారు. వర్సిటీ సిబ్బంది వారిని ద‌వాఖాన‌కు తరలించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, వార్డెన్‌ డాక్టర్‌ యాలాద్రి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్ప‌డంతో విద్యార్థులు శాంతించారు.

Advertisement
Advertisement