త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | జూన్ 2లోగా ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాప‌న‌.. చిలుక‌ప‌చ్చ రంగులో ఆడ‌బిడ్డ‌ల‌కు ఇందిర‌మ్మ చీరెలు : సీఎం రేవంత్‌

CM Revanth Reddy | జూన్ 2లోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాప‌న చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌సంగించారు. పిప్రి బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. 'ఈ ప్రాంతంలో ఎర్ర‌బ‌స్సు తిర‌గ‌డ‌మే క‌ష్టం. పాయ‌ల్ శంక‌ర్‌, ఎంపీ న‌గేశ్ ఈ ప్రాంతంలోని నాయ‌కులు, హైద‌రాబాద్‌కే ఎయిర్‌పోర్టా? ఆదిలాబాద్‌కే అక్క‌ర్లేదా? అని అడిగారు.

P

Telangana | Published On Apr 6, 2026, 7.12 pm IST

CM Revanth Reddy | జూన్ 2లోగా ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాప‌న‌.. చిలుక‌ప‌చ్చ రంగులో ఆడ‌బిడ్డ‌ల‌కు ఇందిర‌మ్మ చీరెలు : సీఎం రేవంత్‌
Advertisement

CM Revanth Reddy | జూన్ 2లోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాప‌న చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌సంగించారు. పిప్రి బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. 'ఈ ప్రాంతంలో ఎర్ర‌బ‌స్సు తిర‌గ‌డ‌మే క‌ష్టం. పాయ‌ల్ శంక‌ర్‌, ఎంపీ న‌గేశ్ ఈ ప్రాంతంలోని నాయ‌కులు, హైద‌రాబాద్‌కే ఎయిర్‌పోర్టా? ఆదిలాబాద్‌కే అక్క‌ర్లేదా? అని అడిగారు. కేంద్రం, ప్ర‌ధాని మోదీతో మాట్లాడాం. త్వ‌ర‌లోనే, వీలైతే జూన్ 2లోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్స‌వానికి శిలాఫ‌లకం వేసే బాధ్య‌త వేదికపైనున్న అంద‌రం తీసుకుంటున్నాం. అది న‌డ‌వాలంటే ప్ర‌యాణ‌కులు ఉండాలి క‌దా? అందుకే ఈ ప్రాంతాన్ని ప‌ర్యాట‌క కేంద్రాన్నే కాదు.. పారిశ్రామిక కేంద్రంగా మార్చాల‌ని.. ఆదిలాబాద్‌లో ప్రాంతంలో వేలాది ఎక‌రాల్లో దేశంలోనే గొప్ప పారిశ్రామిక వాడ‌ను మంజూరు చేసి.. ఆదివాసీ గిరిజ‌న బిడ్డ‌ల‌కు, నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తాం' అని హామీ ఇచ్చారు.

వేగంగా భూసేక‌ర‌ణ‌..

'ఈ పారిశ్రామిక వాడ‌కు సంబంధించి భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ వేగంగా సాగుతోంది. అలాగే, అన్నిజిల్లాల్లో యూనివ‌ర్సిటీలు ఉన్నాయ్‌. ఆదిలాబాద్‌లో లేదని విద్యార్థి యువ‌కులు అడిగారు. ప్ర‌భుత్వం ఆదిలాబాద్‌కు యూనివ‌ర్సిటీ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లోనే ప్రారంభోత్స‌వానికి వ‌స్తాను. ఇవాళ బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యానికి వెళ్లాం. తెలంగాణ‌నే కాదు.. దేశం న‌లుమూల‌ల నుంచి చిన్న‌పిల్ల‌ల‌కు అక్ష‌రాభాస్యం చేయించేందుకు వ‌స్తుంటారు. ఆల‌యం విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. మౌలిక వ‌స‌తుల‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. నా మ‌నుమ‌డి బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యంలో అక్ష‌రాభ్యాసం చేయించి.. ఆదిలాబాద్ ప్రాంతానికి ఉన్న ప‌విత్ర‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశాం. ఆల‌య విస్త‌ర‌ణ‌కు రూ.225కోట్లు మంజూరు చేసి.. ప‌నుల‌ను ప్రారంభించుకున్నామ‌ని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. అవ‌స‌ర‌మైతే ఇంకా నిధులు ఇస్తాం' సీఎం హామీ ఇచ్చారు.

దేశంలోనే గొప్ప ఆల‌యంగా బాసర..

'దేశంలోనే బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యాన్ని గొప్ప దేవ‌స్థానంగా తీర్చిదిద్దే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వం తీసుకుంటుంది. గూడెం స‌త్య‌నారాయ‌ణ స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తాం. మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. బాస‌ర నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు ఆల‌యాల అభివృద్ధి అనుకున్నామో.. అందులో భాగంగా గూడెం ఆల‌యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నామ‌న్నారు. ప్ర‌తి రెండునెల‌ల‌కోసారి త‌ప్ప‌కుండా ఈ జిల్లాకు వ‌స్తూనే ఉంటాను. నిధులు తెస్తూనే ఉంటా. ఆనాడు కొట్లాట కోసం ఒక‌స్ఫూర్తి కోసం ఆదిలాబాద్‌నే ఎన్నుకున్నాం. ఈనాడు కూడా తెలంగాణ అభివృద్ధిని ఆదిలాబాద్ ద్వారానే ప్ర‌పంచానికి చూపించాల‌ని.. గోదావ‌రి జ‌లాలను ఒడిపిస‌ట్టాలి.. ఈ నేల‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాలి.. ప్రాంతాన్ని అభివృద్ధి ప‌థం వైపు న‌డిపించేందుకు మీ అంద‌రి స‌హ‌కారం కావాలి. ప్ర‌భుత్వ ఏ ప‌థ‌కం తెచ్చినా.. ప్ర‌జ‌ల కండ్ల‌లో ఆనందం చూడాల‌ని.. మేం పాల‌కులం కాదు.. ప్ర‌జ‌లు ఉన్న‌కున్న సేవ‌కులం' అని వ్యాఖ్యానించారు.

ఆడ‌బిడ్డ‌ల‌తోనే ధైర్యం..

'ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయాల‌న్న ఆలోచ‌న‌తోనే మీ ముందు నిల‌బ‌డ్డం. అందుకే ఆదిలాబాద్‌పై ఈనాడు మాకున్న ప్ర‌త్యేక‌మైన అభిమానం.. మీ గుండెల‌నిండా ఉన్న‌ది కాబ‌ట్టే ఎర్ర‌టి ఎండ‌లో కూడా త‌ర‌లివ‌చ్చారు. ఇంత మంది ఆడ‌బిడ్డ‌లు ఆశీర్వ‌దించేందుకు వ‌స్తే.. ఇక ఎవ‌రు ఎదురువ‌చ్చినా ఎదుర్కొనే ధైర్యం వ‌స్త‌ది. అందుకే మా అక్క‌ల‌కు ఇందిర‌మ్మ చీర‌లు ఇచ్చాం. ఈసారి చిల‌క‌ప‌చ్చ రంగుతోని మా ఆడ‌బిడ్డ‌లు.. చిలుక‌ల్లా ఉండాలి.. ఇంటాయ‌న కూడా సంతోష‌ప‌డాలి అబ్బ మా ఆవిడ ఎంత అందంగా ఉంద‌ని సంతోష‌ప‌డాలి. మ‌ళ్లీ ఇందిర‌మ్మ చీర‌ల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశాం. ఈ సారి చిలుక‌ప‌చ్చ చీరెలు ఇవ్వాల్సిందిగా భ‌ట్టి విక్ర‌మార్క‌ను నిధులు మంజూరు చేయాల‌ని కోరుతున్నాం. మ‌నం ఇచ్చే చీర పుట్టింటి ఆడ‌బిడ్డ‌కు ఇచ్చే సారెలా ఉండాలి. నువ్వు ఏం ఇచ్చినా ఆడ‌బిడ్డ‌కు సంతోషం ఉండ‌దు. కానీ, పుట్టింటోళ్లు పెట్టిన చీర‌ను జాగ్ర‌త్త‌గా అల‌మార‌లో పెట్టుకుంట‌రు. ఈ సంప్ర‌దాయాన్ని ముందుకు తీసుకెళ్తాం' అన్నారు.

మ‌ట్టిలో మాణిక్యాల‌ను వెలికి తీస్తాం..

'ఈనాడు గంజాయి, డ్ర‌గ్స్‌, పబ్‌లు అని యువ‌త తిరుగుతున్న‌రు. మ‌త్తుబాట వ‌ద‌ల‌రా.. మైదానాల బాట ప‌ట్టురా ఆ పిల్ల‌ల‌కు స్ఫూర్తి నింపేందుకు నేను క్రీడామైదానాల‌కు వెళ్ల‌డ‌మే కాదు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు కూడా ఆట‌ల‌పోటీలు పెట్టాం. అందుకే ఇవాళ ప్ర‌పంచ‌దిగ్గ‌జమై మెస్సీని ఫుట్‌బాల్ ఆడేందుకు తెలంగాణ‌కు తీసుకువ‌చ్చాం. హైద‌రాబాద్ నుంచి వెళ్లిన‌వెంట‌నే శాస‌న‌స‌భ్యులు నా దృష్టికి తీసుకువ‌చ్చిన నివేదిక‌లు ఉన్నాయో.. ప్ర‌త్యేకంగా స‌మీక్షించాల‌ని మంత్రి జూప‌ల్లిని ఆదేశిస్తున్నాను. యువ‌కుల్లో చైత‌న్యం, సంక‌ల్పం ఉంది. మ‌ట్టిలో మాణిక్యాల‌ను వెలికి తీసే బాధ్య‌త జిల్లా ఇన్‌చార్జి మంత్రిదే. మినీ స్టేడియంతో పాటు క్రీడాక‌ళాశాల మైదానం అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి' అని ఆదేశించారు.

Advertisement
Advertisement