త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ex Minister Laxma Reddy | కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Ex Minister Laxma Reddy | పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడంపై మాజీ మంత్రి డాక్ట‌ర్ సీ లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందన్నారు. కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపడం దుర్మార్గమని విమర్శించారు.

P

Telangana | Published On Aug 10, 2026, 8.35 pm IST

Ex Minister Laxma Reddy | కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Advertisement

Ex Minister Laxma Reddy | పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడంపై మాజీ మంత్రి డాక్ట‌ర్ సీ లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందన్నారు. కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి పంపడం దుర్మార్గమని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నాయని లక్ష్మారెడ్డి ఆరోపించారు. తెలంగాణకు చెందిన 16 మంది కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో మాట్లాడటం లేదని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెడుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తూ సొంత జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు మరోసారి అన్యాయం చేస్తోందని అన్నారు. చంద్రబాబు కోసం బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తోందని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయహోదా ఇస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను చేపట్టి 90 శాతం పూర్తి చేయడంతో పాటు ఒకటి రెండు మినహా అన్ని అనుమతులు సాధించామని లక్ష్మారెడ్డి తెలిపారు. ఇతర ప్రాజెక్టులకు లేని అభ్యంతరాలు తెలంగాణ ప్రాజెక్టులకే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే డీపీఆర్‌ను ఆమోదించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement