త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | 15 ఏళ్ల నాటి కేసుకు తెర‌.. కేసీఆర్, కేటీఆర్‌పై న‌మోదైన కేసు కొట్టివేత‌

KCR | తెలంగాణ ఉద్య‌మ కాలం నాటి ఓ కేసు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊర‌ట ల‌భించింది. స‌క‌ల జ‌నుల స‌మ్మె స‌మ‌యంలో న‌మోదైన కేసును నాంప‌ల్లి ప్ర‌జాప్ర‌తినిధుల‌ కోర్టు సోమ‌వారం కొట్టేసింది.

S

Telangana | Published On Mar 9, 2026, 6.42 pm IST

KCR | 15 ఏళ్ల నాటి కేసుకు తెర‌.. కేసీఆర్, కేటీఆర్‌పై న‌మోదైన కేసు కొట్టివేత‌
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్య‌మ కాలం నాటి ఓ కేసు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊర‌ట ల‌భించింది. స‌క‌ల జ‌నుల స‌మ్మె స‌మ‌యంలో న‌మోదైన కేసును నాంప‌ల్లి ప్ర‌జాప్ర‌తినిధుల‌ కోర్టు సోమ‌వారం కొట్టేసింది.

కేసులు పూర్వ‌ప‌రాలు ఇవే..

తెలంగాణ ఉద్య‌మం 2009 న‌వంబ‌ర్ నెల‌లో ఉవ్వెత్తున ఎగిసిప‌డిన సంగ‌తి తెలిసిందే. నాటి నుంచి 2014 మార్చి వ‌ర‌కు అనేక ర‌కాల ఉద్య‌మాలు కొన‌సాగాయి. 2011 సమయంలో సకల జనుల సమ్మె పిలుపులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఈ పిలుపులో భాగంగా రైల్ రోకోలు, ర‌హ‌దారుల దిగ్భంధం వంటి నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ఆటంకం క‌లిగించార‌న్న నెపంతో.. కేసీఆర్, కేటీఆర్ స‌హా ప‌లువురిపై కేసులు న‌మోద‌య్యాయి. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం నిందితుల‌పై స‌రైన ఆధారాలు లేవ‌ని అభిప్రాయ‌ప‌డుతూ నాడు న‌మోదైన కేసును కొట్టేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువ‌రించింది. ఈ తీర్పుతో సుమారు 15 ఏళ్ల నాటి వివాదానికి తెరపడింది. తాజాగా వెలువడిన తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమకారులపై ఉన్న అక్రమ కేసులన్నీ వీగిపోతాయని నేతలు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement