MP Raghunandan Rao | ఇప్పుడు ఆకలైతుంది బువ్వ పెట్టమంటే.. వచ్చే ఏడాది పెడ్తడట రేవంత్‌రెడ్డి
MP Raghunandan Rao | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వమంటే వచ్చే ఏడాది నుంచి రూ.2వేల కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడని మెదక్ ఎంపీ రఘునందర్‌రావు అన్నారు. ఇప్పుడు ఆకలైతుంది బువ్వ పెట్టమంటే వచ్చే ఏడాది పెడ్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
- ఇయ్యాళ కడుపు నింపనోడు రేపు నింపుతడా?
- విద్యార్థులారా.. కాంగ్రెస్‌ను పాతాళం అంటేదాకా తొక్కండి
- రాహుల్ జంతర్‌మంతర్ పోతడు.. కానీ ఇక్కడి విద్యార్థుల సమస్యలు ఆయనకు అర్థం కావ్
- అమెరికాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పే నువ్వు.. మా దీక్షకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో ఈరోజు సాయంత్రం జరిగే మీటింగుల చెప్పు
- ఫీజు బకాయిలు-బీజేపీ లడాయి దీక్షలో సీఎం రేవంత్‌కు మెదక్ ఎంపీ రఘునందర్‌రావు సూటి ప్రశ్నలు
MP Raghunandan Rao | త్రినేత్ర.న్యూస్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వమంటే వచ్చే ఏడాది నుంచి రూ.2వేల కోట్లు అడ్వాన్స్‌గా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడని మెదక్ ఎంపీ రఘునందర్‌రావు అన్నారు. ఇప్పుడు ఆకలైతుంది బువ్వ పెట్టమంటే వచ్చే ఏడాది పెడ్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అవ్వ బతుకున్నప్పుడు బువ్వ పెట్టడం రేవంత్‌రెడ్డికి చేతనైతలేదన్నారు. కానీ అవ్వ సచ్చపోయినంక వాళ్ల చెల్లెను పిలిచి చిన్నమ్మా నీకు బంగారు గాజులు చేపిస్తా అన్నడట రేవంత్‌రెడ్డి అసొంటోడని వ్యంగ్యంగా విమర్శించారు. ఫీజు బకాయిలు - బీజేపీ లడాయి రెండు రోజుల దీక్షలో భాగంగా సోమవారం నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సామెతలతో రేవంత్‌పై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆక్రంధన, బాధను అనుభవిస్తున్నరు. దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాలి. బాధ్యత గల ప్రతిపక్షంగా దీక్షకు పూనుకున్నం. అమెరికా పోతా అంటే పర్మిషన్ ఇవ్వలేదని చెప్పే రేవంత్‌రెడ్డి గారు.. మీరు సీఎంగా ఉన్న ఈ రాష్ట్రంలో 48 గంటలు దీక్ష చేస్తామని అడిగితే అనుమతి ఇవ్వని మీకు అమెరికా టూర్‌పై మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా? ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో సమాధానం చెప్పు.
మొన్న ఏన్నో మీటింగ్ వెట్టి చెప్తున్నడు.. విద్యార్థుల నుంచి వచ్చిన నిరసన, తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆందోళనను గమనించి వచ్చే సంవత్సరం నుంచి 2 వేల కోట్లు అడ్వాన్స్ బకాయిలుగా ఇస్తమని చెప్తున్నడు. మాకు ఇప్పుడు ఆకలి అయితుంది ఒంటి గంటకు బువ్వ పెట్టమంటే వచ్చే సంవత్సరం బువ్వ పెడతా అని చెప్తున్నడు. ఇయ్యాళ కడుపు నింపలేనోడు రేపు నింపుతడా?
సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే సమస్యను పరిష్కరించనీకి చేతనైతలేదు. తెలంగాణల ఒక సామెత చెప్తరు.. అవ్వ బతుకున్నప్పుడు బువ్వ పెట్టడం చేతగాలే రేవంత్‌రెడ్డికి. కానీ అవ్వ సచ్చపోయినంక వాళ్ల చెల్లెను పిలిచి.. చిన్నమ్మా నీకు బంగారు గాజులు చేపిస్తా అన్నడట రేవంత్‌రెడ్డి అసొంటోడు. ఇప్పుడు పైసలు లేవ్. వచ్చే ఏడాది ఇస్తడట. ఇది రేవంత్ నీతి, నిజాయితి, కాంగ్రెస్ పార్టీ దమన నీతి.
కాంగ్రెసోళ్లు ఢిల్లీకి వస్తరు. రాహుల్‌గాంధీ జంతర్‌మంతర్ దగ్గరకు పోతడు. కానీ ఇక్కడ ఉన్న 40 లక్షల మంది ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి రాహుల్‌కు అర్థం కాదు. విద్యార్థుల పట్ల రాహుల్‌కు, కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుట్రలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ అంటేనే వంచన..
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఆలోచించాలి. బీజేపీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తుంటే వారిని ఆందోళనల వైపు నడిపేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలను విద్యార్థులు తిప్పికొట్టాలి. ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మించబడుతది అని స్వామి వివేకానంద చెప్తడు. మీరే దేశ పౌరులు, రేపు మీకే ఈ దేశాన్ని పాలించే హక్కు ఉంది. దయచేసి ఆలోచించండి. కాంగ్రెస్ అంటేనే వంచన. కాంగ్రెస్ అంటేనే మోసం. రేవంత్ ఇచ్చిన హామీలను మీ తల్లిదండ్రులకు గుర్తు చేయండి. కాంగ్రెస్‌ను పాతాళం అంటేదాక తొక్కాలి అని కోరుతున్నా అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట
ఆగస్టు 24, 2026

Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్
ఆగస్టు 24, 2026

Ponguleti Srinivas Reddy | హరీశ్‌రావు గారు! మీలా ఫాంహౌస్ ప్రభుత్వం కాదిది.. ప్రజా ప్రభుత్వం
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?
- ●Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?
- ●Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ నిరుద్యోగం
- ●ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!
- ●Heavy Rain | భారీ వర్షానికి స్తంభించిన ఢిల్లీ.. 250 విమానాలు ఆలస్యం
- ●Meheshwar Reddy | ఇక్కడ పాఠశాలల్లో వసతులు లేవంటే.. ఎక్కడో ఉన్న ‘ఆక్స్ఫర్డ్’ను తీసుకొస్తడట

Sara Arjun | ప్రేమలో పడ్డ ధురంధర్ హీరోయిన్ - బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో సీక్రెట్ డేటింగ్?

Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?

Feesula Bakai - BJP Ladayi | సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఎక్కువ నిరుద్యోగం

ల్యాండ్ పూలింగ్ '60:40' ఆఫర్: భూమి ఇచ్చేముందు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన 5 పక్కా నిజాలు!



