త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MeeTicket App | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ‘మీటికెట్’ యాప్‌లోనే బస్సు టికెట్లు, బస్ పాస్‌లు

టీజీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త! ఇకపై సుదూర ప్రాంతాల బస్సు టికెట్లతో పాటు హైదరాబాద్ సిటీ బస్ పాస్‌లు, T24 టికెట్లను 'మీసేవ మీ టికెట్' (MeeTicket) మొబైల్ యాప్ ద్వారా సులభంగా డిజిటల్‌ విధానంలో బుక్ చేసుకోవచ్చు.

J

Telangana | Published On Feb 24, 2026, 7.52 pm IST

MeeTicket App | ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ‘మీటికెట్’ యాప్‌లోనే బస్సు టికెట్లు, బస్ పాస్‌లు
Advertisement

MeeTicket App | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకపై బస్సు టికెట్లు, సిటీ బస్ పాస్‌ల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా 'మీసేవ మీ టికెట్' (MeeTicket) మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మంగళవారం సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నూతన మొబైల్ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, మీసేవ కమిషనర్ రవికిరణ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Bus Tickets and Passes and T24 Now on TGSRTC MeeSeva MeTicket App

ఒకే యాప్‌లో అన్నీ.. సుదూర ప్రయాణాలకు OPRS సేవలు

ఈ 'మీ టికెట్' యాప్‌లో ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (OPRS) సేవలను అనుసంధానించారు. దీని ద్వారా ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు, ఇతర నగరాలకు వెళ్లే బస్సు టికెట్లను స్మార్ట్‌ఫోన్‌లోనే బుక్ చేసుకోవచ్చు.

మొత్తం OPRS సేవలు: 1,710 (ఏసీ సేవలు: 450, నాన్-ఏసీ: 1,260)

రోజువారీ బుకింగ్ సామర్థ్యం: దాదాపు 13,000 సీట్లు.

ముఖ్యమైన గమ్యస్థానాలు: బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్.

Bus Tickets and Passes and T24 Now on TGSRTC MeeSeva MeTicket App

హైదరాబాద్ వాసులకు వరం.. మొబైల్‌లోనే బస్ పాస్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే ప్రయాణికులు ఇకపై తమ నెలవారీ సిటీ బస్ పాస్‌లను ఈ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చు, అలాగే పునరుద్ధరించుకోవచ్చు (Renew). మొత్తం ఐదు కేటగిరీల పాస్‌లు యాప్‌లో అందుబాటులో ఉంచారు.

వాటి ఛార్జీల వివరాలు:

సిటీ ఆర్డినరీ పాస్: నెలకు రూ.1,400

మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్: నెలకు రూ.1,600

మెట్రో డీలక్స్ పాస్: నెలకు రూ.1,800

గ్రీన్ మెట్రో లగ్జరీ A/C పాస్: నెలకు రూ.2,200

పుష్పక్ A/C పాస్: నెలకు రూ.5,000

పర్యాటకులకు బెస్ట్ ఆప్షన్: T24 టికెట్

[video width="1280" height="720" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-24-at-19.23.57.mp4"][/video]

జంట నగరాల్లో ప్రయాణించే పర్యాటకులు, ఒకే రోజు ఎక్కువ ప్రయాణాలు చేసే వారికోసం రూపొందించిన T24 (24 గంటల డిజిటల్ ట్రావెల్ పాస్) టికెట్‌ను కూడా ఈ యాప్‌లో విలీనం చేశారు. యాక్టివేట్ చేసిన సమయం నుంచి 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. రోజుకు సగటున 16,830 మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేస్తున్నారు.

T24 టికెట్ ఛార్జీలు:

పెద్దలకు: రూ.130

పిల్లలకు: రూ.90

మహిళలు (ఇతర రాష్ట్రాల వారు) / సీనియర్ సిటిజన్లు: రూ.110

[video width="848" height="480" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/02/WhatsApp-Video-2026-02-24-at-19.23.55.mp4"][/video]

 

Advertisement
Advertisement