త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేపు మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి ఇంటికి కేటీఆర్

KTR | మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఏ పార్టీలో చేరుతాన‌నే అంశంపై ఆయ‌న స్వ‌యానా ఇప్ప‌టికీ ప్ర‌క‌టించ‌లేదు.

S

Telangana | Published On Apr 8, 2026, 7.49 pm IST

KTR | రేపు మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి ఇంటికి కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఏ పార్టీలో చేరుతాన‌నే అంశంపై ఆయ‌న స్వ‌యానా ఇప్ప‌టికీ ప్ర‌క‌టించ‌లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ నెల 9న జ‌గిత్యాల‌లోని జీవ‌న్ రెడ్డి నివాసానికి వెళ్ల‌నున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవ‌న్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించ‌నున్నారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, కొప్పుల ఈశ్వ‌ర్ కూడా జీవ‌న్ రెడ్డి ఇంటికి వెళ్ల‌నున్నారు. జీవ‌న్ రెడ్డితో కేటీఆర్ బుధ‌వారం ఫోన్‌లో మాట్లాడారు.

Advertisement
Advertisement