త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఢిల్లీ మ‌ద్యం కేసులో క‌విత‌కు క్లీన్ చిట్‌.. కేటీఆర్ కీలక ట్వీట్

KTR | ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

S

Telangana | Published On Feb 27, 2026, 3.05 pm IST

KTR | ఢిల్లీ మ‌ద్యం కేసులో క‌విత‌కు క్లీన్ చిట్‌.. కేటీఆర్ కీలక ట్వీట్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. మ‌ద్యం కుంభ‌కోణం పేరుతో ఢిల్లీలో ఆప్ ప్ర‌భుత్వాన్ని కూల్చారు. ఇదే క‌థ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓట‌మికి కార‌ణ‌మైంది. ఢిల్లీ మ‌ద్యం కేసులో ఉన్న క‌విత‌కు ఇవాళ న్యాయం జ‌రిగింది. మా లీడ‌ర్ల‌పై న‌మోదైన ప్ర‌తి కేసు రాజ‌కీక్ష క‌క్ష‌లో భాగ‌మే. నిజాలు బ‌య‌ట‌కు రానంత కాలం కాంగ్రెస్, బీజేపీ దుష్ప్ర‌చారాల‌ను చూస్తూనే ఉంటాం. ఏదేమైనా చివ‌ర‌కు న్యాయ‌మే గెలుస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

https://x.com/KTRBRS/status/2027296950639595695

Advertisement
Advertisement