KTR | 46 లక్షల మంది తరపున అసెంబ్లీలో ప్రయివేటు మెంబర్ బిల్లు : కేటీఆర్
KTR | ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని ప్రజాసమస్యలపై నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమవుతోంది. 16 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అరాచకాలను ప్రశ్నించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 46 లక్షల మంది లబ్ధిదారుల తరపున అసెంబ్లీలో ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.
ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎక్కడ..?
మేం పెట్టే ప్రయివేటు మెంబర్ బిల్లుకు కాంగ్రెస్ కూడా మద్దతివ్వాలి
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగడుతాం
జీరో వాల్యూ ఉన్నది రేవంత్ రెడ్డికే
డే ఎకానమీని నాశనం చేసి.. నైట్ ఎకానమీ గురించి మాట్లాడడమా..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టినా రాజీనామా చేస్తా
KTR | త్రినేత్ర.న్యూస్ : ఈ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని ప్రజాసమస్యలపై నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమవుతోంది. 16 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అరాచకాలను ప్రశ్నించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 46 లక్షల మంది లబ్ధిదారుల తరపున అసెంబ్లీలో ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయానా ప్రకటించారు. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో బడ్జెట్ సమావేశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఆరు గ్యారెంటీల అమలు విషయంలో రాహుల్ గాంధీ మాటిచ్చారు. తొలి కేబినెట్ సమావేశంలోనే మేం ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. రెండున్నరేండ్లు కావొస్తుంది చట్టబద్ధత అనేది చుట్టబండలై పోయింది. అందుకే ఆరు గ్యారెంటీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేం ప్రయివేటు మెంబర్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. 46 లక్షల మంది తరపున ఈబిల్లు పెడుతున్నాం. మేం పెట్టే ఈ ప్రయివేట్ మెంబర్ బిల్లుకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడం కోసమే ఈరోజు ఈ సమావేశాన్ని మా పార్టీ ఏర్పాటు చేసుకున్నదని కేటీఆర్ తెలిపారు.
అంకెల గారడీని ఎండగడుతాం..
రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన వెలుగుమట్ల బాధితుల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో సహా ఎండగట్టాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ సుందరీకరణ
ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తాం. దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈరోజు జరిగిన సమావేశాల మాదిరి భవిష్యత్తులోనూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాం. శాసనమండలి, శాసనసభ మధ్య మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, 420 హామీల అమలుకు డబ్బులు లేవని చెప్తున్నది. రైతన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని చెప్తున్నది. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి మూసీ పేరుతో అవినీతి కార్యక్రమానికి తెరలేపింది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు. కానీ ఒకవైపు డబ్బులు లేవు, అప్పులయ్యాయని చెబుతూనే మూసీలో లక్షన్నర కోట్ల రూపాయల అవినీతితో లక్షలాది మంది ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేయడం లేదు, కేవలం ఢిల్లీకి డబ్బులు పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టును చేపడుతున్నాడు. మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసీలో జరిగే లక్షల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకం. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం కాదు, అసలు జీరో వ్యాల్యూ ఎవరికైనా ఉన్నది అంటే అది రేవంత్ రెడ్డికే. రేవంత్ రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువ ఉన్నది అని కేటీఆర్ ఎద్దెవా చేశారు.
ఒక్క ఇల్లు కట్టిన రాజీనామా చేస్తా..
రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు, తాను తీసుకున్న నిర్ణయాలు కూడా తనకే తెలియదని చెప్తున్నాడు. డే ఎకానమీని నాశనం చేసిన వ్యక్తి నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రాహుల్ బంధు పథకాన్ని పక్కన పెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టాలి. రెండున్నర సంవత్సరాలలో ఒక్క ఇల్లు అయినా కాంగ్రెస్ పార్టీ కట్టింది అంటే నేను రాజీనామా చేస్తానని చెప్పాను, దానికి నేను ఇంకా కట్టుబడి ఉన్నాను. మేము కట్టిన ఫ్లైఓవర్లు, ఇళ్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి మావి అని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



