త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | 2027లో పాదయాత్ర చేస్తా.. ప్రజా సమస్యలపై పోరాడతా

KTR | ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర చేపడతానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

S

Telangana | Published On Apr 12, 2026, 6.51 pm IST

KTR | 2027లో పాదయాత్ర చేస్తా.. ప్రజా సమస్యలపై పోరాడతా
Advertisement

పార్టీ పేరు మార్చి నష్టపోయాం
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు
కొన్ని తప్పులు చేశాం.. వాటిని సరిదిద్దుకుంటాం
వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన

KTR | త్రినేత్ర.న్యూస్ : ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర చేపడతానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పినట్టుగానే.. రాష్ట్రం ఆగమైందిని మళ్లీ మునుపటి తెలంగాణ లాగా పరిస్థితులు తలకిందులయ్యాయని చెప్పారు. రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, వ్యాపార వర్గాల వారు ఎవ్వరూ సీఎం రేవంత్ రెడ్డి పాలనను హర్షించడం లేదని తెలిపారు. 6 గ్యారంటీల పేరుతో జనాల్ని మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని నియోజకవర్గాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే బీఆర్ఎస్ పార్టీ.. సమస్యలపై నిరంతరం అధికార పక్షంపై పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది 2027లో తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మాకు ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.

కొన్ని తప్పులు చేశాం

కాగా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తమ హయాంలో జరిగిన కొన్ని తప్పులను హూందాగా ఒప్పుకున్నారు. వాటిని సరిదిద్దుకుంటామని చెప్పారు. పార్టీ పేరు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా మార్చి నష్టపోయామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, సర్పంచులను, ఎంపీటీసీ, మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యాం. మా పాలనలో అందరు జర్నలిస్టులకు న్యాయం చేయలేకపోయాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన‌ లక్షలాది మంది గల్ఫ్‌లో ఉంటున్నా మేం గల్ఫ్ పాలసీ తీసుకురాలేకపోయాం. టీజీబీకేఎస్‌లో జరిగిన ఘటనలను బీఆర్ఎస్ అప్పుడే కొంత సీరియస్‌గా తీసుకుని ఉంటే మరిన్ని అసెంబ్లీ సీట్లు గెలిచేవాళ్ళం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా పార్టీ బలం పెరుగుతుంది. మే, జూన్ నెలలో పార్టీ సభ్యత్వం స్టార్ట్ చేస్తాం, కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పార్టీ పటిష్టతకు కృషి చేస్తాం. డిలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరిగి బీఆర్ఎస్‌లో చాలా మందికి అవకాశాలు వస్తాయి.. అని కేటీఆర్ అన్నారు.

Advertisement
Advertisement