KTR | 30 నెలల్లో కూడా ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే.. నిన్ను ఏమనాలి..? రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న
KTR | వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక్క గ్యారెంటీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 30 నెలల్లో కూడా ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే నిన్ను ఏమనాలి.. ఏమనుకోవాలి అని అడుగుతున్నానని సీఎంను కేటీఆర్ ప్రశ్నించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఒక్క గ్యారెంటీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 30 నెలల్లో కూడా ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే నిన్ను ఏమనాలి.. ఏమనుకోవాలి అని అడుగుతున్నానని సీఎంను కేటీఆర్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
అధికార పార్టీ కుట్రలను ఛేదించి, 51 రోజులు కుటుంబాలకు, ప్రలోభాలకు దూరంగా ఉంటూ, కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొంటూ.. బాల్క సుమన్, రాజిరెడ్డిని జైలుకు పంపినా కూడా మొక్కవోనీ దీక్షతో పోరాడి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన క్యాతన్‌పల్లి సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన కౌన్సిలర్లకు సెల్యూట్..
రాజకీయాల్లో ఎన్నో చూస్తుంటాం. కానీ ఇంత నీచమైన రాజకీయాన్ని చూసి ఉండరు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో 22 కౌన్సిలర్ స్లానాల్లో 14 గెలిచాం. మెజార్టీ సాధించాం. చర్చ లేనే లేదు. మాకే మున్సిపాలిటీ దక్కాలి. ఇక చెన్నూరులో కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చింది.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అయ్యారు. ఇక్కడ మనవాళ్లు కావాలి. కానీ ఒక్క మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ నియోజకవర్గం కాబట్టి.. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ తలపించే విధంగా యుద్దానికి పోయినట్టు క్యాతన్‌పల్లిలో 1000 మంది పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. లేని కేసులు బనాయించి.. దౌర్జన్యం చేసి కౌన్సిలర్లను ఎత్తుకుపోయే పరిస్థితి కల్పించారు. చివరకు బ్లాంక్ చెక్కులు కూడా రాసిచ్చారు. కానీ బోడి పైసలు ఎవడికీ కావాలని వాళ్ల ముఖాన కొట్టి.. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన కౌన్సిలర్లకు సెల్యూట్ చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
నాకు మున్సిపాలిటీ కావాలని అడిగితే సుమన్ పడేస్తుండే..
సుమన్‌ను పట్టుబట్టి.. వాళ్ల ఆటలు సాగవని చెప్పి ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. ఆ జైలులో కనీసం సదుపాయాలు లేవు. సుమన్ మీద దోమలతో దాడి చేయించారు. ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో 16 రోజుల పాటు సుమన్ జైల్లో ఉన్నారు. ఒక్క మున్సిపాలిటీ కోసం వివేక్ నీచమైన పనులు చేశారు. ఇది నా నియోజకవర్గం.. ఇజ్జత్ పోతుంది.. నాకు మున్సిపాలిటీ కావాలని అడిగితే సుమన్ పడేస్తుండే.. అది పెద్ద ముచ్చట కాదు అని కేటీఆర్ అన్నారు.
మంత్రి చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు..
సుమన్ మొండిగా పోరాటం చేసిండు. మా అందరికీ ధైర్యం చెప్పిండు.. జైల్లో ఏడాదైనా ఉంటాను కానీ.. కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండని కోరిండు. రాష్ట్రంలో అరాచక రాజకీయం జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లు కూలగొడుతున్నారు. భూమా గౌడ్ ఇంటి మీదికి బుల్డోజర్‌ను పంపి బెదిరించారు. కాంగ్రెస్ సభ్యులు అసభ్యకరంగా ప్రవర్తిస్తే మంత్రి చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు కానీ మందలించలేదు.
ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమని పిలవాలి..
ఉమ్మడి ఆదిలాబాద్‌కు సీఎం వచ్చారు. లేకి మాటలు మాట్లాడారు. ఎంత పెద్ద కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లో పిల్లలను పుట్టించలేరు కదా.. 9 నెలలు ఆగాలి కదా.. మూడు నెలలు కాదు కదా.. పీసీసీ అధ్యక్షుడిగా నువ్వు, భట్టి విక్రమార్క గ్యారెంటీ కార్డులను పంచారు. నూరు రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం అని నమ్మబలికి గద్దెనెక్కారు. మూడు నెలల్లో పిల్లలు పుట్టరు అని అంటున్న సీఎం గారు 30 నెలలు అవుతుంది.. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమని పిలవాలి.. నీకు ఏం పేరు పెట్టాలని అడుగుతున్నాం. 30 నెలల్లో కూడా ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే నిన్ను ఏమనాలి.. ఏమనుకోవాలి అని అడుగుతున్నాను అని కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!
- ●Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు

Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు





