KTR | సాయి ఈశ్వర్ మృతిపట్ల కేటీఆర్ నివాళి
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిందని సాయి ఈశ్వర్ అనే యువకుడు ప్రాణత్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు మౌనం వహించి నివాళులర్పించారు.
KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిందని సాయి ఈశ్వర్ అనే యువకుడు ప్రాణత్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు మౌనం వహించి నివాళులర్పించారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ఆత్మహత్యాయత్నం చేసిన సాయి ఈశ్వర్ చారి(38) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని బోడుప్పల్ ప్రాంతంలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న)కు చెందిన క్యూన్యూస్ కార్యాలయం వద్ద సాయి ఈశ్వర్ చారి గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ఉన్న ఈశ్వర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సంగారెడ్డి ప్రాంతంలోని పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ చారి.. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని బీరప్పనగర్‌లో నివాసముంటూ క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవారు. ఆయనకు భార్య కవిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి
కాంగ్రెస్ సర్కార్ చేసిన ధోకాకు కలతచెంది
ఆత్మర్పణ చేసిన బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మౌనం వహించి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, పార్టీ నాయకులు pic.twitter.com/6jNExJQUTx— BRS Party (@BRSparty) December 6, 2025
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



