KTR | కారెక్కండి.. జీవన్ రెడ్డిని ఆహ్వానించిన కేటీఆర్
KTR | జగిత్యాలలో మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : జగిత్యాలలో మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
ఇవాళ ఉదయం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. ఉద్యోగులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
జాతీయ స్థాయిలో బీజేపీ అయితే ఉత్తమమని, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస రాష్ట్ర నాయకత్వంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తరచూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
మార్చి 25న రాజీనామా..
నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడాలంటే బాధాకరంగా ఉంది.. కానీ సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడ వల్ల పార్టీని వీడక తప్పడం లేదని మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ రెండున్నరేండ్లు ఎంతో మానసిక క్షోభ, అవమానాలు భరించానని పేర్కొన్నారు. ఇక రాబోయే రెండేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ పార్టీ నాది అని భావిస్తూ.. సీనియర్లను తొక్కుతున్న రేవంత్ రెడ్డికి భవిష్యత్‌లో తగిన గుణపాఠం చెబుతాం.. ఇక నుంచి మమ్మల్ని ఏ శక్తి ఆపలేదని జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇది క్లిష్ట సమయం నాకు.. నా జీవిత చివరి పోరాటం ఇది.. మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగాను.. భవిష్యత్‌లో జగిత్యాలను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే నా సంకల్పం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తన మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను విడుదల చేశారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



