KTR | మోదీ! నీవు కొరివితో తల గోక్కుంటున్నవ్
KTR | ఇవాళ దేశంలో ఎవరితోనైతో పెట్టుకోవద్దో.. వారితోనే పెట్టుకుంటున్నవ్.. కొరివితో తల గోక్కుంటున్నవ్.. మోదీ గారు జాగ్రత్త పడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది.. నవతరం వరుస మారుతున్నది.. రాజ్యమా ఉలిక్కిపడు.. గుర్తు పెట్టుకో.. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు.
ఎవరితోనైతే పెట్టుకోవద్దో..
వారితోనే పెట్టుకున్నవ్
నేపాల్, శ్రీలంక గతి తప్పదు
వాట్సాప్ యూనివర్సిటీకి, ఇన్‌స్టా జనరేషన్‌కు
పంచాయితీ పడ్దది..
ఎవరు ఆగమైతరో చూద్దాం
ఢిల్లీలో విద్యార్థులు గళమెత్తుతుంటే
సీఎం రేవంతేమో గల్లీలో ధర్నాలు
విద్యార్థుల ఆందోళనతో
కేసీఆర్ తల్లడిల్లిపోతుండు
ఇందిరా పార్కు ధర్నాలో కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్ : ఇవాళ దేశంలో ఎవరితోనైతో పెట్టుకోవద్దో.. వారితోనే పెట్టుకుంటున్నవ్.. కొరివితో తల గోక్కుంటున్నవ్.. మోదీ గారు జాగ్రత్త పడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తరం మారుతున్నది.. స్వరం మారుతున్నది.. నవతరం వరుస మారుతున్నది.. రాజ్యమా ఉలిక్కిపడు.. గుర్తు పెట్టుకో.. జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. పిల్లలు తలుచుకుంటే మొన్ననే నేపాల్‌లో ప్రభుత్వం కుప్పకూలింది. శ్రీలంకలో ఇదే పిల్లలు ఉరికించికొట్టారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో.. వారితోనే పెట్టుకుని వారి అహం మీద కొట్టినవ్ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణిచివేతకు, దాష్టీకానికి వ్యతిరేకంగా ఇందిరా పార్కులో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని నీట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

విద్యా విధానంలో సంస్కరణలు రావాలని సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు కూర్చుంటే ఒక్క మీడియా సంస్థ చూపెట్టదు. ఒక్క మీడియా వోడు రాడు. భయం ఏం చేస్తారో అని.. ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు చేయిస్తారని, తమ వేట కుక్కలను పంపి ఇబ్బంది పెడుతారేమో అని భయం. జెన్ జీ ఏం చేసింది.. యంగ్ జనరేషన్ ఏం చేసింది.. ఏ మీడియా గిడియా జాన్తా నై.. మా సోషల్ మీడియా ఉందని దేశాన్ని మొత్తం కదిలించింది. అందుకే అంట ఉన్న.. మోదీ గారూ మీరు ఎవరితో పెట్టుకోవద్దు వారితోనే పెట్టుకున్నవ్.. మీ వాట్సాప్ యూనివర్సిటీ అంధ భక్తులకు, ఇన్‌స్టాగ్రామ్ జనరేషన్‌కు పంచాయితీ పడ్డది.. ఇక ఎవరు ఆగమైతరో.. ఎవరు ఏమైతరో మీరు కూడా చూస్తారు.. నేను కూడా చూస్తా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు కదం తొక్కుతున్నరు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గళం విప్పుతున్నరు. వాళ్ళ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా, విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఈ నిరసన చేపట్టాం.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు, ఎజెండా లేదు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పిల్లలపై దమనకాండ ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డికి మాత్రం కేసీఆర్, కేటీఆర్ జపమే
బడే భాయ్' మోడీని ప్రశ్నిస్తుంటే.. 'ఛోటా భాయ్' రేవంత్‌రెడ్డికి ఎందుకు కోపం వస్తోంది? దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, 'జెన్ జీ' యువత నీట్ పేపర్ లీకేజీపై, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఢిల్లీ వీధుల్లో గళమెత్తుతుంటే.. రేవంత్ రెడ్డికి మాత్రం కేసీఆర్, కేటీఆర్ జపమే తప్ప వేరే ధ్యాస లేదు! ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను నిలదీసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. పాత కేసులు, భయాలతో మోడీకి లొంగిపోయి.. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ తెచ్చినోళ్లం.. ఢిల్లీ మెడలు వంచిన చరిత్ర ఉన్నోళ్లం.. విద్యార్థుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
విద్యార్థుల ఆందోళన చూసి కేసీఆర్ తల్లడిల్లిపోతున్నడు
విద్యార్థుల ఆందోళన చూసి కేసీఆర్ తల్లడిల్లిపోతున్నడు. అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడు. ఇండియా రియాక్ట్స్.. పిల్లలు భవిష్యత్తు నిర్మాతలు, వాళ్ళే దేశ ముఖచిత్రాన్ని మారుస్తరు, వాళ్లే ఈ దేశాన్ని కాపాడుకుంటరని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు.
రేపు కేసుల్లో బెయిల్.. మరి మాకు న్యాయం జరగదా..?
రేప్ కేసులలో బీజేపీ నాయకుల కొడుకులకు బెయిల్ వస్తుంది కానీ.. పేపర్ లీకులు జరిగితే మాకు న్యాయం ఎందుకు జరగడం లేదని విద్యార్థులు అడుగుతున్నరు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా? దేశం కోసం ధర్మం కోసం అంటారు, ఈ పిల్లలు హిందువులు కాదా? మీడియాతోని ఎజెండా సెట్ చేసే రాజకీయం ఇక నడవదు. స్లాటర్ హౌజ్‌లను అడ్డంపెట్టుకొని వ్యక్తిత్వ హననం చేసే రాజకీయం ఇక నడవదు. పిల్లలే భవిష్యత్ నిర్మాతలు.. ఈరోజు వారి దగ్గర పదునైన ఆయుధం సోషల్ మీడియా ఉంది. జెన్ జీ పోరాటం కేవలం నీట్ పేపర్ లీక్ కోసమే కాదు... రాజకీయ జవాబుదారీతనం కోసం అని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన





