KTR | ఎక్కడ సచ్చింది ఎన్డీఎస్ఏ..? కేంద్రంపై కేటీఆర్ ఫైర్
KTR | తెలంగాణ చెక్ డ్యామ్‌లను పటాకుల పేల్చుతుంటే.. ఎన్డీఎస్ఏ ఎక్కడ సచ్చింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఆనాడు ఆగమేఘాల మీద వచ్చి 48 గంటల్లోనే కాళేశ్వరం మీద రిపోర్టు ఇచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఎక్కడుంది..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ చెక్ డ్యామ్‌లను పటాకుల పేల్చుతుంటే.. ఎన్డీఎస్ఏ ఎక్కడ సచ్చింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఆనాడు ఆగమేఘాల మీద వచ్చి 48 గంటల్లోనే కాళేశ్వరం మీద రిపోర్టు ఇచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఎక్కడుంది..? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ వచ్చాక ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఎస్ఎల్‌బీసీలో ఆరు మంది కార్మికులు జల సమాధి అయ్యారు. ఇప్పటికీ ఆచూకీ లేదు.. ఇది కాంగ్రెస్ కక్కుర్తికి, కమీషన్లకు అవినీతికి నిదర్శనం కాదా..? ఆ రోజు ఎన్డీఎస్ఏ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టుకుంటూ వచ్చి కాళేశ్వరం మీద 48 గంటల్లో రిపోర్టు ఇచ్చింది. మరి ఇవాళ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కుప్పకూలితే ఎక్కడ సచ్చింది ఎన్డీఎస్ఏ..? వట్టెం పంపు హౌస్ మునిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ..? సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ. 120 కోట్లు నష్టం జరిగితే ఎక్కడ సచ్చింది మీ ఎన్డీఎస్ఏ..? వీరిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. పెద్ద వాగు కొట్టుకుపోయింది.. చెక్ డ్యామ్‌లను పటాకులను పేల్చినట్టు పేల్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది..? ఎన్డీఎస్ఏ ఎక్కడ పోయింది..? ఇది కదా కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం.. ఆనాడు పిలవకముందే ఎన్డీఎస్ఏ వచ్చింది.. ఇవాళ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతలేరు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నియోజకవర్గంలోనే చెక్ డ్యామ్‌లను పటాకుల మాదిరి పేల్చుతున్నారు. కేసు పెట్టి నలుగురిని లోపల వేయొచ్చు కదా.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి. ఫెవికాల్ బంధాన్ని రైతులు ప్రజలు గమనిస్తున్నారు. దొందూ దొందే.. ఇప్పటికైనా కూడా కాళేశ్వరం మీద ఆగమేఘాల మీద ఉరికి వచ్చిన ఎన్డీఎస్ఏ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేలుతున్న చెక్‌డ్యామ్‌లపై ఇండిపెండెంట్‌గా ఎంక్వైరీ చేయండి.. వరద ప్రవాహాన్ని తట్టుకుని నిటారుగా నిలబడ్డ మేడిగడ్డ రెండు పిల్లర్లు ఎట్ల కుంగుతాయి.. ఎవరో పేల్చారో తేలాలి అని కేటీఆర్ అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



