త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | బండి సంజ‌య్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల్సిందే.. కేటీఆర్ డిమాండ్

KTR | బండి భ‌గీర‌థ్ పోక్సో కేసులో విచార‌ణ స‌జావుగా, నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాలంటే కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌ను త‌క్ష‌ణ‌మే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ప్ర‌ధాని మోదీని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On May 17, 2026, 3.56 pm IST

KTR | బండి సంజ‌య్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయాల్సిందే.. కేటీఆర్ డిమాండ్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : బండి భ‌గీర‌థ్ పోక్సో కేసులో విచార‌ణ స‌జావుగా, నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాలంటే కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌ను త‌క్ష‌ణ‌మే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ప్ర‌ధాని మోదీని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్‌బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల శిక్ష‌ణా శిబిరంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ రాష్ట్రంలో గ‌త వారం రోజులుగా ఏం జ‌రుగుతుందో ఆలోచించాలి. ఒక అమ్మాయికి అన్యాయం జ‌రిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్ర‌భుత్వం మీద దున్న‌పోతు మీద వాన ప‌డ్డ‌ట్టు కూడా కాలేదు. ఒక మైన‌ర్‌కు స‌హాయం చేసేందుకు ముందుకు రాలేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం, బీజేపీ నేత‌ల‌తో పాటు త‌ప్పు చేసిన వారు నోరు మూసుకున్నారు. కానీ ఆ అమ్మాయి త‌ర‌పున కొట్లాడింది నిల‌బ‌డింది మాత్రం బీఆర్ఎస్సే. ఈ రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా బీఆర్ఎస్ నిల‌బ‌డుతుంది. గొంతు విప్పేది, కొట్లాడేది మ‌న‌మే.

అయినా త‌ల్లిదండ్రులు అద‌ర‌లేదు బెద‌ర‌లేదు..

ఆ మైన‌ర్‌ త‌ల్లిదండ్రుల‌కు స‌లాం చెప్పాలి. ఎందుకంటే ఒక వైపు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి, మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ పుల్ పోస్టుల్లో ఉన్నారు.. అయినా త‌ల్లిదండ్రులు అద‌ర‌లేదు బెద‌ర‌లేదు. రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ కుమ్మ‌క్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాల‌నుకున్నా వారు వెన‌క్కి త‌గ్గ‌లేదు. కామాంధుడి చేతిలో విల‌విలలాడిన ఆమెకు న్యాయం చేయాల‌ని చెప్పి ఆ త‌ల్లిదండ్రులు చేసిన పోరాటానికి అండ‌గా బీఆర్ఎస్ మ‌హిళా నాయ‌క‌త్వం మ‌ద్ద‌తు ప‌లికారు. ఎక్క‌డిక‌క్క‌డ పోరాటం చేసి కాళీకాదేవిల్లా విరుచుకుప‌డ్డారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కూడా పోరాటం చేశారు. ఆ అమ్మాయి త‌ర‌పున మ‌హిళా నేత‌లు, విద్యార్థి సంఘాలు, సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ పోరాటంతో ఇవాళ అమ్మాయికి కొంత న్యాయం జ‌రిగే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక నిన్న లొంగిపోయాడో అరెస్టు అయ్యాడో ఆ డ్రామా న‌డుస్తోంది అని కేటీఆర్ అన్నారు.

9 రోజులు కేంద్ర మంత్రి దాచిపెట్టారు..

బేటీ బ‌చావో బేటీ ప‌డావో నినాదాల‌కే ప‌రిమితమైతే న్యాయం జ‌ర‌గ‌దు మోదీ గారు. బ‌హుషా దేశంలో ఒక కేంద్ర మంత్రి కుమారుడి మీద లుకౌట్ నోటీసులు ఇచ్చే ప‌రిస్థితి వ‌చ్చింది. బండి సంజ‌య్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌క‌పోతే విచార‌ణ స‌జావుగా సాగే ప‌రిస్థితి లేనేలేదు. త‌ప్పు చేసిన వ్య‌క్తిని 9 రోజులు కేంద్ర మంత్రి దాచిపెట్టారు. ఇలాంటి వ్య‌క్తులు ప‌ద‌వుల్లో కొన‌సాగుతూ ఉండ‌డం తెలంగాణ‌కే కాదు, దేశానికి కూడా అవ‌మాన‌క‌రం అని కేటీఆర్ అన్నారు.

మీడియాను మ‌నీ ట్రాప్‌గా చేసి

మైన‌ర్‌కు అన్యాయం చేసింది కుమారుడైతే.. త‌ల్లిదండ్రుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసింది ఆయ‌న తండ్రి కేంద్ర మంత్రి. ఇంత తీవ్ర‌మైన కేసును నీరుగార్చే ప్ర‌య‌త్నం చేసింది ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం. హ‌నీట్రాప్ అని మీడియాను మ‌నీ ట్రాప్‌గా చేసి గొంతు నొక్కి వార్త‌లు రానివ్వ‌కుండా సీఎం, కేంద్ర మంత్రి కుట్ర చేశారు. క‌చ్చితంగా కేంద్ర మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం. పోక్సో కేసులో విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా జ‌రపాల‌ని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement