Komatireddy Venkat Reddy | తప్పకుండా మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలి: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy | తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు తప్పనిసరిగా ధన్యవాదాలు తెలపాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ (KTR) చేసిన ప్రసంగానికి సమాధానమిస్తూ కోమటిరెడ్డి బీఆర్ఎస్ (BRS)పై విమర్శలు గుప్పించారు.
Komatireddy Venkat Reddy | త్రినేత్ర.న్యూస్ : తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు తప్పనిసరిగా ధన్యవాదాలు తెలపాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ (KTR) చేసిన ప్రసంగానికి సమాధానమిస్తూ కోమటిరెడ్డి బీఆర్ఎస్ (BRS)పై విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని, తాము రేషన్ కార్డులు మంజూరు చేసి, సన్నబియ్యం సైతం ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో అంతర్జాతీయ హోటళ్ల స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, అవి పూర్తి కావస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 278 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణాలు చేసినందుకు 11 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. ప్రతి గ్రామాల్లో 30-40 ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నారన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలని సూచించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేసినందుకు, డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టినందుకు బీఆర్ఎస్‌కు కృతజ్ఞతలు తెలపాలా అని ఎద్దేవా చేశారు. పేదవర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అప్పుల బారిన పడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ముందుకు పోతున్నామని అన్నారు. రిజర్వాయర్లు నిర్మించారని, కానీ భూసేకరణ చేయలేదని, ప్రాజెక్టులు లేవని, నీళ్లు లేవని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన రూ. మూడు లక్షల ఇరవై అయిదు కోట్ల అప్పులు కట్టి, రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న సందర్భంగా తప్పనిసరిగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఆగస్టు 20, 2026

Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
ఆగస్టు 19, 2026

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..



