త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | ఒరిజిన‌ల్ ఎప్ప‌టికీ ఒరిజిన‌లే.. టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ సెటైర్

BRS | క‌విత (Kavitha) కొత్త‌గా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీపై బీఆర్ఎస్ (BRS) సెటైర్ వేసింది. ఒరిజిన‌ల్ ఎప్ప‌టికీ ఒరిజిన‌లే అంటూ క‌విత త‌మ పార్టీ పేరును కాపీ కొట్టింద‌ని అర్ధం వ‌చ్చేలా.. కోల్గేట్‌, బిస్ల‌రీ బ్రాండ్ల ఒరిజిన‌ల్‌, ఫేక్ ఫోటోల‌ను ఎక్స్‌లో షేర్ చేసింది.

G

Telangana | Published On Apr 25, 2026, 12.37 pm IST

BRS | ఒరిజిన‌ల్ ఎప్ప‌టికీ ఒరిజిన‌లే.. టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ సెటైర్
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: క‌విత (Kavitha) కొత్త‌గా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీపై బీఆర్ఎస్ (BRS) సెటైర్ వేసింది. ఒరిజిన‌ల్ ఎప్ప‌టికీ ఒరిజిన‌లే అంటూ క‌విత త‌మ పార్టీ పేరును కాపీ కొట్టింద‌ని అర్ధం వ‌చ్చేలా.. కోల్గేట్‌, బిస్ల‌రీ బ్రాండ్ల ఒరిజిన‌ల్‌, ఫేక్ ఫోటోల‌ను ఎక్స్‌లో షేర్ చేసింది.

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత కొత్త రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించారు. పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అని ఆమె నామ‌క‌ర‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఏ క‌ష్ట‌మొచ్చినా ఆ సారు రారు, ఎందుకంటే ఆయ‌న మారిన మ‌నిషి అన్నారు. ఆయ‌న గుంట‌న‌క్క‌ల చేతిలో ఇరుక్కున మ‌నిషి, మ‌న మ‌నిషి కాద‌ని విమ‌ర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని క‌ర్కోట‌కుడిగా అభివ‌ర్ణించారు. ప్ర‌స్తుతం రాష్ట్రం క‌ర్కోట‌కుడి పాల‌న‌లో ఉన్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ ఎంపీ ఆంధ్రాలో క‌లిసిన 5 గ్రామాల‌ను వెన‌క్కి తీసుకురావాల‌ని స‌వాల్ విసిరారు.

పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వ‌స్తే వాటిని త‌ప్పకుండా అమ‌లు చేస్తామ‌న్నారు.
1. విద్య: ప్రైవేట్ స్కూళ్లలో సైతం ఉచిత విద్య. ప్ర‌భుత్వ బ‌డిలో స‌క‌ల వ‌స‌తులు క‌ల్పిస్తాం. ఒక్క‌పైసా ఖ‌ర్చుపెట్ట‌కుండా పీజీ వ‌ర‌కు చ‌దువుకునేందుకు ఏర్పాట్లు చేస్తాం.
2. వైద్యం: ఏ రోగమొచ్చినా, ఏ ఆస్పత్రికి వెళ్లినా ఉచిత వైద్యం.
3. వ్యవసాయం: 'రైతే రాజు' నినాదాన్ని నిజం చేస్తాం.
4. ఉపాధి: యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు. తొలి ఏడాదే సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు, ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ పోస్టులు.
5. సామాజిక న్యాయం కచ్చితంగా సాధించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
Advertisement