BRS | అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఆందోళన.. దండుపాళ్యం బ్యాచ్‌పై విచారణకు డిమాండ్
BRS | రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని అసెంబ్లీని స్తంభింపచేశారు.
BRS | త్రినేత్ర.న్యూస్: రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయాలని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని అసెంబ్లీని స్తంభింపచేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద హరీశ్ రావు, కేటీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై ఆధారాలతో సహా బయట పెట్టామన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన ఇతర సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తప్పుచేయకపోతే భయమెందుకని నిలదీశారు. గత రెండేండ్లుగా అక్రమ మైనింగ్ చేస్తూ.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ.. మంత్రి పొంగులేటికి చెందిన మైనింగ్ సంస్థ వందల కోట్ల రూపాయల సొమ్మును పోగు చేసుకుంది. మైనింగ్ శాఖ పెంచిన ఫీజుల ప్రకారం.. ఈ ప్రభుత్వానికి రూ.1800 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. వచ్చింది కేవలం రూ.900 కోట్లు మాత్రమేనన్నారు. మిగిలిన రూ.900 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. సభా సంఘం వేసి ప్రభుత్వంలోని దండుపాళ్యం బ్యాచ్ పాత్ర గురించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మెట్రో టేకోవర్‌పై అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎల్&టీ అనే ప్రైవేట్ కంపెనీకి ఉన్న రూ.15 వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా రుద్దుతున్నదని చెప్పారు. వేల కోట్ల సంపదను దోచుకోవడానికి, ఎల్ అండ్ టీ కంపెనీ సీఎఫ్ఓను జైలులో వేస్తామని బెదిరిస్తూ.. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో తాను చెప్పిన మాట వినడం లేదని కాంగ్రెస్ గూండాలు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎల్ అండ్ టీ కంపెనీకి లీజుకిచ్చిన రూ.22 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిని కొట్టేయడానికి కాంగ్రెస్ 'దండుపాళ్యం బ్యాచ్' కుట్రకు తెరలేపిందని ఆరోపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Ponguleti Srinivas Reddy | దొరల గడీల్లో బందీ అయిన భూమిని విడిపిస్తాం.. పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం: మంత్రి పొంగులేటి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



