KTR | అడ్డగోలుగా మాట్లాడిన అందరికీ ఈ ఎన్నికలే సమాధానం : కేటీఆర్
KTR | పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా కార్యకర్తలు గట్టిగా కొట్లాడారని.. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వారందరికీ ఈ ఎన్నికలే సమాధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
KTR | పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా కార్యకర్తలు గట్టిగా కొట్లాడారని.. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వారందరికీ ఈ ఎన్నికలే సమాధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉంది. వారు ఆశించిన స్థానాలు రాలేదు. మా పార్టీ కార్యకర్తల అద్భుతంగా పోరాటం చేశారు. ఓవరాల్‌గా 30 మున్సిపాలిటీల పైగా వస్తాయి అనుకున్నాం. కానీ, వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా మాకు విజయావకాశాలు ఉన్నాయి. బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదు. వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయి' అని గుర్తు చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రచారం చేసినా..
'బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేసింది. హడావిడి చేసింది. కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏం ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు, ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్లకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయింది. కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసింది. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసింది' అని హర్షం వ్యక్తం చేశారు కేటీఆర్.
ఎక్స్ అఫీషియో నిబంధనల్లో ప్రభుత్వానికే స్పష్టత లేదు
'ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదు. నిన్నటి దాకా కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలపై ఎవరికీ స్పష్టత లేదు. మరోసారి ఫార్ములా ఈ అనే అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తున్నది. ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి వాళ్లు చేసింది ఏమీ లేదు. కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉంది. ఎన్ని సార్లు పిలిచినా పోతాము, ఉన్న సత్యం స్పష్టంగా చెబుతాం. ఎన్ని సార్లు పిలిచినా, ఎన్ని సార్లు విచారణ చేసినా మాకేమీ ఇబ్బంది లేదు. చివరికి జైలులో పెట్టినా భయపడేది లేదు. ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్ అధికారులు, ఏసీబీ అధికారులు సీఎంకే ఇప్పటికే పలుమార్లు చెప్పారు' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



