త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Strike | ఆర్టీసీ స‌మ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

RTC Strike | ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వమే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపి, జీవో ఇచ్చింది అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

S

Telangana | Published On Apr 22, 2026, 5.09 pm IST

RTC Strike | ఆర్టీసీ స‌మ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు
Advertisement

RTC Strike | త్రినేత్ర‌.న్యూస్ : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వమే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపి, జీవో ఇచ్చింది అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారు. కొత్తవి ఏమీ అడగడం లేదు. మహాలక్ష్మి పథకం పెట్టి ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ. 3 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. నిధులు లేకపోవడంతో కార్మికులకు డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నారు. బడ్జెట్‌లో చూపిస్తున్నా నిధులు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఏటా రూ. 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement