త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Sarovar Project | గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్.. ఎన్జీటీలో మ‌ళ్లీ కార్తీక్ రెడ్డి పిటిష‌న్

Gandhi Sarovar Project | కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో (ఎన్‌జీటీ) బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి మ‌ళ్లీ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

S

Telangana | Published On Apr 17, 2026, 3.27 pm IST

Gandhi Sarovar Project | గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్.. ఎన్జీటీలో మ‌ళ్లీ కార్తీక్ రెడ్డి పిటిష‌న్
Advertisement

Gandhi Sarovar Project | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో (ఎన్‌జీటీ) బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి మ‌ళ్లీ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మూసీ సుందరీకరణ కింద చేపట్టబోతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల నుండి పర్యావరణ అనుమతి తీసుకోలేదని కార్తీక్ రెడ్డి పిటీషన్‌లో పేర్కొన్నారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మృగవాణి నేషనల్ పార్క్‌కు 10 కిలోమీటర్ల పరిధిలో ఉంది కాబట్టి అవసరమైన డీటెయిల్డ్ ప్రాజక్ట్ రిపోర్ట్ తయారు చేయలేదని, ఇతర అంశాల గురించి స్పష్టత లేదని కార్తీక్ రెడ్డి ఆరోపించారు. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకుసాగుతున్న ఈ ప్రాజెక్ట్, పర్యావరణానికి సంబంధించిన పలు చట్టాలను ఉల్లంఘిస్తుందని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

అయితే ఎన్‌జీటీలో కేసు పడటంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది.. పర్యావరణ అనుమతికి దరఖాస్తు చేశామని, త్వరలోనే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (EIA) రిపోర్ట్ సిద్ధం చేస్తామని ఎన్‌జీటీకి తెలిపింది. ఎన్‌జీటీ కేసుతో ప్రభుత్వం పూర్తిగా ఇరకాటంలో పడింది.. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయంలో కానీ, ఇతర అనుమతుల విషయంలో కానీ రేవంత్ సర్కార్ ఏమైనా ఉదాసీనంగా వ్యవహరించినా.. లేక స్వలాభం కోసం ఏవైనా ఉల్లంఘనలు చేసినా కానీ ప్రాజెక్టు విషయంలో మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. హడావిడిగా మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కూలగొట్టి, భూములు స్వాధీనం చేసుకుందాం అనుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు తప్పక చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన పరిస్థితి అనివార్యమైంది అని ప‌లువురు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement