Navaratri Brahmotsavam | సింహ వాహనంపై యోగ నరసింహునిగా మలయప్పస్వామి
Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సింహ వాహనసేవ బుధవారం వైభవంగా జరిగింది. మలయప్పస్వామివారు యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు.
Devotional | Published On Oct 14, 2026, 3.48 pm IST
- తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Navaratri Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు సింహ వాహనసేవ బుధవారం వైభవంగా జరిగింది. మలయప్పస్వామివారు యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోయారు. తిరుమాడ వీధుల్లో సింహ వాహనసేవ కనులపండువగా సాగింది. ముందుగా గజరాజులు గంభీరంగా కదులుతుండగా.. భజనలు, కోలాటాలు, జీయంగార్ల వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. హరినామ సంకీర్తనలతో తిరుమల పురవీధులు మార్మోగాయి. అడుగడుగునా భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

ధైర్య, పరాక్రమాలకు ప్రతీక సింహ వాహనం
సింహం ధైర్యం, పరాక్రమం, తేజస్సుకు ప్రతీక. దుష్టశిక్షణ, శిష్టరక్షణ సంకల్పానికి నిదర్శనంగా శ్రీ మలయప్పస్వామివారు సింహ వాహనంపై విహరించారు. యోగ నరసింహస్వామి అలంకారంలో స్వామివారి దర్శనం భక్తుల్లో నిర్భయత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ధర్మమార్గంలో పయనిస్తూ సత్యాన్ని ఆచరించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని సింహ వాహనసేవ చాటిచెప్పింది. సింహ వాహనసేవలో తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భాను ప్రకాష్‌రెడ్డి, జానకిదేవి, రంగశ్రీ, శాంత రామ్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Navaratri Brahmotsavam | బ్రహ్మోత్సవాల వేళ.. సప్తగిరుల ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
అక్టోబర్ 14, 2026

Navaratri Brahmotsavam Special | 157 దేశాల కరెన్సీతో వెంకన్న హుండీ కళకళ!
అక్టోబర్ 14, 2026

CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..
- ●Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?
- ●Soma Bharat Kumar | హరీశ్‌రావుకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు
- ●Ponguleti Srinivas Reddy | అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు
- ●Dell XPS 13 | 2.5కె డిస్ప్లే, డాల్బీ అట్మోస్‌తో డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే..
- ●Justice Madan Lokur | ఓటర్ల జాబితా సవరణపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. సమస్యలపై మాజీ జడ్జిల కమిషన్.. రేపే తొలి విచారణ

Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..

Cockroach Janata Party | కాక్రోచ్లకు ఫండింగ్ చేస్తున్నారు.. ఎవరో తెలుసా?

Soma Bharat Kumar | హరీశ్‌రావుకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు

Ponguleti Srinivas Reddy | అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు



