Kyathanpalli | క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్
Kyathanpalli | ఎట్టకేలకు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఈ మున్సిపాలిటీలో పాగా వేయాలనుకుని అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాలేదు.
Kyathanpalli | త్రినేత్ర.న్యూస్ : ఎట్టకేలకు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఈ మున్సిపాలిటీలో పాగా వేయాలనుకుని అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాలేదు. చివరకు 51 రోజుల తర్వాత.. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. అయితే సీపీఐ మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దక్కించుకుంది.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ కూటమి కలిసి పోటీ చేశాయి. మొత్తం 22 వార్డులకు గానూ 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారు. బీఆర్ఎస్, సీపీఐ కూటమి మెజార్టీ ఉన్నప్పటికీ.. మంత్రి వివేక్ వేసిన ఎత్తుగడలతో.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు కోర్టు ఆదేశాలతో శనివారం పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నిక నిర్వహించి, సజావుగా ముగించారు.
ఇవాళ నిర్వహించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్, సీపీఐ నుంచి ఎన్నికైన 14 మంది కౌన్సిలర్లు మాత్రం ఎన్నికకు హాజరయ్యారు. ఇక కోరం ఉండటంతో ఎన్నిక ప్రక్రియను సజావుగా కొనసాగించారు. దీంతో గొడిశెల సంధ్యారాణి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్‌గా గెలుపొందారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కూడా గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ ఎన్నికయ్యారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






