MP Vaddiraju | తెలంగాణను ఆదుకోండి.. కేంద్రానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి
MP Vaddiraju | ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
MP Vaddiraju | ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. వర్షాలు లేక రిజర్వాయర్లు, చెరువులు ఎండిపోవడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, దీంతో సాగు, తాగునీటి సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం జరిగింది. బీఆర్ఎస్ తరఫున ఎంపీ రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన సమావేశంలో ప్రస్తావించారు. సమావేశం అనంతరం మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచనల మేరకు..
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు రాష్ట్ర సమస్యలను అఖిల పక్ష సమావేశంలో లేవనెత్తినట్లు తెలిపారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో విద్యుదుత్పత్తి కూడా ప్రభావితమైందని, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ విద్యుత్ కోతలు తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ అవసరాలను తీర్చేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ 13 ఏళ్ల పోరాటం ఫలితంగానే తాడిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణి సంస్థకు అప్పగించారని రవిచంద్ర గుర్తు చేశారు. ప్రైవేటు సంస్థల పరిధిలో ఉన్న కోయగూడెం-3, సత్తుపల్లి-3, శ్రావణపల్లి తదితర గనులకు పర్యావరణ అనుమతులు ఇచ్చి వాటిని సింగరేణికి బదలాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. గోలేటి, మణుగూరు, పూసపల్లి, మాదారం, కేకే గనులను కూడా సింగరేణికి అప్పగిస్తే బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు సంస్థకు లాభాలు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం..
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి నుంచి నీటి పంపింగ్ కొనసాగితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రవిచంద్ర ఆరోపించారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించే ప్రతిపాదనలకు కేంద్రం అనుమతులు ఇస్తూ, తెలంగాణలోని అంబేడ్కర్-వాద్రా, సీతమ్మ, సమ్మక్క-సారలమ్మ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం, సాగునీరు, ఉచిత విద్యుత్, ఎరువుల సరఫరా వంటి చర్యలు చేపట్టడంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని రవిచంద్ర పేర్కొన్నారు. దాని ఫలితంగా తెలంగాణలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ప్రతి గింజను కొనుగోలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు.
బయ్యారం ఉక్కు కర్మాగారం..
ఆదిలాబాద్ సీసీఐ కర్మాగారాన్ని పునరుద్ధరించడం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు వంటి అంశాలను కూడా అఖిల పక్ష సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. ఆదిలాబాద్, మామునూరు, కొత్తగూడెం విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. చట్టసభల్లో ఓబీసీలు, మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కేసీఆర్ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని రవిచంద్ర గుర్తు చేశారు. భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశకు అనుమతులు, ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు వంటి అంశాలను కూడా అఖిల పక్ష సమావేశంలో ప్రస్తావించినట్లు ఎంపీ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత






