త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Palla Rajeshwar reddy | బండి సంజ‌య్‌తో ఒరిగేదేం లేదు.. నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ప‌ల్లా

MLA Palla Rajeshwar reddy | కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌తో క‌రీనంగ‌ర్ ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేం లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం, బీజేపీ నేత‌లు కుమ్మ‌క్కై హ‌త్య రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.

S

Telangana | Published On May 8, 2026, 1.11 pm IST

MLA Palla Rajeshwar reddy | బండి సంజ‌య్‌తో ఒరిగేదేం లేదు.. నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ప‌ల్లా
Advertisement

MLA Palla Rajeshwar reddy | త్రినేత్ర‌.న్యూస్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌తో క‌రీనంగ‌ర్ ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేం లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం, బీజేపీ నేత‌లు కుమ్మ‌క్కై హ‌త్య రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. డీజీపీ సీవీ ఆనంద్‌ను క‌లిసిన అనంత‌రం ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఈ రెండున్న‌రేండ్ల‌లో ప్రొగ్రెస్ ఏందంటే.. హ‌త్య‌లు, దాడులు, మాన‌భంగాలు, అదే విధంగా న‌చ్చ‌ని రాజ‌కీయ నేత‌ల మీద దాడులు కేసులు పెట్ట‌డం. రాష్ట్రంలో జ‌రుగుతున్న దాడులు, దోపిడీలు, నేరాల‌పై డీజీపీకి విన‌తిప‌త్రం ఇచ్చాం. గ‌త వారం రోజుల్లో క‌రీంన‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకున్న ప‌రిస్థితిని వివ‌రించాం. పోలీసుల యొక్క చేత‌గానిత‌నం వ‌ల్లే దాడులు జ‌రుగుతున్నాయి. కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ అనాగ‌రికంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు, గూండాల‌తో ఎమ్మెల్యే గంగుల‌ క‌మ‌లాక‌ర్ ఆఫీసుపై దాడి చేయించారు. కౌశిక్ రెడ్డిని చంపాల‌నే ఉద్దేశంతో పెట్రోల్ బాంబులతో ప్ర‌య‌త్నం చేశారని పల్లా తెలిపారు.

మ‌తం పేరుతో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారు..

క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని జ్యువెల‌రీ షాపులో దోపిడీ చేసి, కాల్పులు జ‌రిపితే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌తో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కేటీఆర్, గంగుల క‌మ‌లాక‌ర్, కౌశిక్ రెడ్డి ప్ర‌శ్నించారు. దాంతో బండి సంజ‌య్‌పై రెచ్చిపోయి ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు. ఏం జ‌రుగుతుంది క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో.. పోలీసులు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడారు. బండి సంజ‌య్ త‌న మాట‌ల‌ను విత్ డ్రా చేసుకుంటే మేం కూడా విత్ డ్రా చేసుకుంటాం. బండిపై కేసు న‌మోదు చేయాలి.. ఇవాళ ఆయ‌న వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఓరిగేది లేదు. మ‌తం పేరుతో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారు. మంత్రి హోదాలో ఒక్క రూపాయి కూడా క‌రీంన‌గ‌ర్‌కు తీసుకురాలేదు అని ప‌ల్లా పేర్కొన్నారు.

కౌశిక్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలి..

కౌశిక్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలి. గంగుల ఆఫీసు మీద దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలి. క్రిశాంక్‌పై అన‌వ‌స‌ర కేసులు పెడుతూ.. బెయిల్ వ‌చ్చాక మ‌ళ్లీ జైల్లో పెడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మ‌క్కై ఈ రాజ‌కీయాలు చేస్తున్నారు. బండి సంజ‌య్‌ను క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు మూడుసార్లు చిత్తుచిత్తుగా ఓడించారు. నీ ప్ర‌వ‌ర్త‌న చూసి ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదు. భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అయితే ఎంపీగా కాదు.. కౌన్సిల‌ర్‌గా కూడా గెలిపించ‌రు. డీజీపీ మాకు మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సిన అవ‌స‌రం లేదు.. చ‌ట్ట‌ప‌రంగా వారిపై చ‌ర్య‌లు తీసుకోండి. దాడుల‌కు ప్ర‌తిదాడులు చేసే స‌త్తా ఉందని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement