త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padi Kaushik Reddy | నేను భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాదు.. క‌రీంన‌గ‌ర్ సీపీకి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చ‌రిక‌

Padi Kaushik Reddy | క‌రీంన‌గ‌ర్ సీపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. బిడ్డా నేను భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాదు.. అని సీపీని కౌశిక్ రెడ్డి హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Mar 17, 2026, 10.43 am IST

Padi Kaushik Reddy | నేను భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాదు.. క‌రీంన‌గ‌ర్ సీపీకి పాడి కౌశిక్ రెడ్డి హెచ్చ‌రిక‌
Advertisement

Padi Kaushik Reddy | త్రినేత్ర‌.న్యూస్ : క‌రీంన‌గ‌ర్ సీపీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. బిడ్డా నేను భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాదు.. అని సీపీని కౌశిక్ రెడ్డి హెచ్చ‌రించారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని మీడియా పాయింట్‌లో కౌశిక్ రెడ్డి మాట్లాడారు.

కరీంనగర్ సీపీ వ్యవహారంపై అసెంబ్లీ తెలియాలి. 15 రోజులుగా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నాం. జల్సాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కరీంనగర్‌లో ఫైరింగ్ రేంజ్‌లో ఆయన భార్య, ఆయన మిత్రులు ఆరుగురు కలిసి 10 రౌండ్లు కాల్పులు జ‌రిపారు. ఏకే 47, మిగతా పిస్టల్‌తో 160 బుల్లెట్ల‌తో ఫైరింగ్ చేశారు. వృద్ధురాలు అమృతమ్మకు బుల్లెట్ తగిలింది. రాయి తగిలింది అని ఆమె అనుకుంది. సెప్టెంబర్ 2025లో ఈ ఘటన జరిగింది. బోనాల‌ప‌ల్లిలో బుల్లెట్ గాయం అని వార్తా క‌థ‌నాలు వ‌చ్చాయి. సీపీ స‌తీమ‌ణి, ఆయ‌న ఐదుగురు దోస్తులు ఎలా ప్ర‌యివేటు వ్యక్తులు ఫైరింగ్ చేశారు. సీఎం, హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డినే ఉన్నారు. ఆయ‌న శాఖ‌లో ఏం జ‌రుగుతుందో ఆయ‌న‌కు తెల్వ‌దా..? అని పాడి కౌశిక్ రెడ్డి నిల‌దీశారు.

మా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకోమని సీఐడీకి చెప్తున్నారు. ఇది కాదు మీరు చేయాల్సింది.. ఇలాంటి వ్యక్తుల మీద ఉన్న వ్యవహారం గమనించండి. ఆ ముసలమ్మ ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎలా ఫైరింగ్ చేస్తారో సీఎం సమాధానం చెప్పాలి. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఒక‌రిద్ద‌రు ఐపీఎస్‌లో త‌ప్పులు చేయ‌డంతో.. మిగ‌తా ఐపీఎస్‌ల‌కు చెడ్డ‌పేరు వస్తుంది. ఐపీఎస్ అసోసియేష‌న్ గతంలో నా మీద ఓ లేఖ రాసింది. నేను చెప్పింది తప్పైతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పాను. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంపై ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించాలి అని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

వికాస్ అగర్వాల్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ వ్యక్తికి ఇన్నోవా వాహనం ఇచ్చి పంపించారు. ఇలా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడున్నారు. కొంత మంది ఆఫీస‌ర్ల తీరుతో పోలీసు వ్య‌వ‌స్థ భ్ర‌ష్టు ప‌డుతుంది. బిడ్డా సీపీ న‌న్ను బెదిరించ‌లేవు. నేను భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాదు. నాకు పోలీస్ మిత్రులు సమాచారం ఇస్తున్నారని వారిని బెదిరిస్తున్నారు. మీకు వందల మంది ఇంటిలిజెన్స్ ఉండొచ్చు, బీఆర్ఎస్‌కి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు అని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement