Padi Kaushik Reddy | నీవు మొగోడివి అయితే.. కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? బండి సంజయ్‌కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్
Padi Kaushik Reddy | కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఏ సబ్జెక్టు మీద మాట్లాడుదామో చెప్పు.. కేటీఆర్‌ను తీసుకువస్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
Padi Kaushik Reddy | త్రినేత్ర.న్యూస్ : కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఏ సబ్జెక్టు మీద మాట్లాడుదామో చెప్పు.. కేటీఆర్‌ను తీసుకువస్తానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బండి సంజయ్.. కేటీఆర్‌ను తిట్టే స్థాయి మీదా..? ఐదు సార్లు ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలిచారు. ప్రజల మనసు గెలచుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టారు. అలాంటి కేటీఆర్‌ను పట్టుకుని అనేకసార్లు నోటికొచ్చినట్టు మాట్లాడతున్నారు. చాలెంజ్ విసురుతున్నా.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. నీవు మొగోడివి అయితే.. కరీంనగర్ గడ్డ మీద నుంచి సవాల్ విసురుతున్నా.. కేటీఆర్‌ను తీసుకొస్తా.. ఈ గీత భవన్ చౌరస్తాలో ఏ సబ్జెక్టు మీద మాట్లాడుదామో చెప్పు. మమ్మమ్మే, తత్తత్తే, బెబ్బెబ్బే అంటే కుదరదు.. నీకు దమ్ముంటే ఇరిగేషన్, సివిల్ సప్లయిస్, హోం శాఖ, ఐటీ, పరిశ్రమలు, కరీంనగర్ పట్టణంలో గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధిపై చర్చ పెడుదాం రా.. సబ్జెక్టు మాట్లాడండి.. నోటికొచ్చినట్టు మాట్లాడితే మేం నీ కంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం అని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
స్మార్ట్ సిటీలో మీ కంట్రిబ్యూషన్ ఏంది..?
బండి సంజయ్ బాధ్యత గల హోం మినిస్టర్ కాదా..? ఈ పదేండ్లలో కరీంనగర్ పట్టణానికి ఏం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కమలార్ అన్న నిల్చోని చెప్తారు. రండి చర్చకు వస్తారా..? కరీంనగర్ పట్టణంలో రోడ్లు వేశారు కేసీఆర్. స్మార్ట్ సిటీలో మీ కంట్రిబ్యూషన్ ఏంది..? కేసీఆర్, వినోద్ కుమార్, గంగుల కమలాకర్ తెచ్చారు.. ఇది వాస్తవం కాదా..? మీరు చేసింది ఏంటి.. రెచ్చగొట్టుడు తప్పితే ఏం లేదు అని బండి సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచారా..?
మీ రాజకీయ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిచారా..? కరీంనగర్‌లో బండి సంజయ్‌ను చిత్తు చిత్తుగా మూడుసార్లు ఓడగొట్టారు గంగుల కమలాకర్. మీరు ఎంపీగా నరేంద్ర మోదీ వేవ్‌లో గెలిచారని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



