త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ముఖ్య‌మంత్రి తొలి సంత‌కానికి జీరో వాల్యూ : కేటీఆర్

KTR | ప్ర‌జ‌ల ఆస్తుల‌ను జీరో వాల్యూ చేశాన‌ని మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఫైలుపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేసిన తొలి సంత‌కానికి జీరో వాల్యూ ఉంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

S

Telangana | Published On Mar 17, 2026, 12.41 pm IST

KTR | ముఖ్య‌మంత్రి తొలి సంత‌కానికి జీరో వాల్యూ : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌జ‌ల ఆస్తుల‌ను జీరో వాల్యూ చేశాన‌ని మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆరు గ్యారెంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఫైలుపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేసిన తొలి సంత‌కానికి జీరో వాల్యూ ఉంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

నిన్న సీఎం మాట్లాడుతూ.. జీరో వాల్యూ చేశాను ప్ర‌జ‌ల ఆస్తుల‌ను అని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి చేసిన తొలి సంత‌కానికి జీరో వాల్యూ, ఆ ఫైలుకు జీరో వాల్యూ. మీ గ్యారెంటీ కార్డుల‌కు ప్ర‌జ‌ల దృష్టిలో జీరో వాల్యూ. మీ డిక్ల‌రేష‌న్ల‌కు ప్ర‌జ‌ల దృష్టిలో జీరో వాల్యూ. మూసీలో మీరు ముంచుతున్న ఇండ్ల‌కు కాదు.. విశ్వ‌స‌నీయ‌త కోల్పోయిన మీ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల దృష్టిలో జీరో వాల్యూ ఉంద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.

ఇది నా క‌విత్వం కాదు.. ఆరు గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ ప్ర‌చురించిన బ్ర‌హ్మాండమైన ఫుల్ పేజీ అడ్వ‌టైజ్‌మెంట్. వంద రోజుల్లో నెర‌వేరుతుంది ప్ర‌తి గ్యారెంటీ అని పెద్ద యాడ్ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారెంటీల‌తో అందే ప్ర‌యోజ‌నాల విలువ 2 ల‌క్ష‌ల 50 వేలు ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌తి కుటుంబానికి. మ‌రి రెండున్న‌రేండ్లు అయింది ఒక్క కుటుంబానికైనా రూ. 2 ల‌క్ష‌ల 50 వేలు అందిన‌ట్లు చూపించే స‌త్తా మీ ప్ర‌భుత్వానికి ఉందా..? అని కేటీఆర్ నిల‌దీశారు.

ప‌దేండ్ల‌లో ఒక్క రేష‌న్ కార్డు ఇవ్వ‌లేద‌ని ఆది శ్రీనివాస్ చెప్పారు. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇదే స‌భ‌లో మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 వ‌ర‌కు ఆరున్న‌ర ల‌క్ష‌ల కార్డులు ఇచ్చార‌ని చెప్పారు. మ‌రి మీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో విబేధిస్తున్నారా..? స‌భ‌లో మంత్రులు చెప్పిన మాట‌ల‌కు విలువ లేక‌పోతే ఎలా.. అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement