త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ మొన‌గాడు కాదు.. పెద్ద మోస‌గాడు : హ‌రీశ్‌రావు

Harish Rao | సీఎం రేవంత్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పెద్ద మోస‌గాడు అని ఈ రెండున్న‌రేండ్ల‌లోనే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మైంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Apr 19, 2026, 6.23 pm IST

Harish Rao | రేవంత్ మొన‌గాడు కాదు.. పెద్ద మోస‌గాడు : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ స‌ర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పెద్ద మోస‌గాడు అని ఈ రెండున్న‌రేండ్ల‌లోనే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మైంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల నోట వ‌స్తున్న మాట రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. కాబ‌ట్టి కేసీఆర్ మ‌ళ్లీ సీఎం అయ్యే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం గుర్రంపోడు మండ‌లంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

హ‌రీశ్‌రావు ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల్లోనే..

నిన్న జ‌గిత్యాల పోయాం. ఇవాళ నాగార్జున‌ సాగ‌ర్ వ‌చ్చాం. ఎక్క‌డ పోయినా ఎవ‌రిని క‌దిలించినా ఒక్క‌టే మాట రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి. నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల నోట వ‌స్తున్న మాట ఇది. ఎందుకంటే ఒక్క‌టి అర్థ‌మైంది.. ఎన్నిక‌ల ముందు రేవంత్ రెడ్డి మొన‌గాడు అనుకున్నారు. కానీ రెండున్న‌రేండ్ల‌లో వీడు మొన‌గాడు కాదు పెద్ద మోస‌గాడు అని స్ప‌ష్టంగా అర్థ‌మైంది.

గాలి మోట‌ర్ల‌కు ప‌రిమిత‌మైండు.. భూమ్మీద లేడు..

వ‌డ్ల బీట్‌కు పోయాను.. పెద్ద మ‌నిషి ద‌శ‌ర‌థ్ రెడ్డి క‌లిశాను. అంత ఆగ‌మై పోయింది.. కేసీఆర్ ఉన్న‌ప్పుడే బాగుండే అంటున్న‌డు. క్వింటాల్‌కు ఐదు కిలోలు, రైస్ మిల్‌కు పోతే 2 కిలోలు.. మొత్తం ఏడు కిలోలు త‌రుగు తీస్తున్నార‌ని తెలిపాడు. వ‌డ్లు కొనే దిక్కు లేదు.. కొంటే త‌రుగు తీస్తున్నారు. రేవంత్ రెడ్డినేమో ఢిల్లీకి పోయి క‌ప్పం క‌ట్టి కుర్చీ కాపాడుకుంటున్నాడు. గాలి మోట‌ర్ల‌కు ప‌రిమిత‌మైండు.. భూమ్మీద లేడు.

ఇప్ప‌టికీ శ‌వాలు బ‌య‌ట‌కు రాలేదు..

ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ కూలిపోతే.. టూరిస్ట్ ప్లేస్‌కు పోయిన‌ట్టు గాలిమోటార్ల‌లో మంత్రులు పోయారు. ఇప్ప‌టికీ శ‌వాలు బ‌య‌ట‌కు రాలేదు. వంద మీట‌ర్లు కూడా పూర్తి కాలేదు. బీఆర్ఎస్ హ‌యాంలో ప‌ద‌కొండున్న‌ర కిలోమీట‌ర్లు ఎస్ఎల్‌బీసీ పూర్తి చేశాం. కానీ క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తి ప‌డ‌డంతో ట‌న్నెల్ కుప్ప‌కూలిపోయింది. 8 ప్రాణాలు బ‌ల‌య్యాయి.. శ‌వాలు కూడా బ‌య‌ట‌కు తీయ‌లేని ద‌ద్ద‌మ్మ ప్ర‌భుత్వం రేవంత్‌ది.

ఆయ‌న పెద‌వులు మూసుకున్నాడు..

రైతుల‌కు ఇచ్చిన ఒక్క మాట కూడా నిల‌బెట్టుకోలేదు. వ‌రంగ‌ల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్ల‌రేష‌న్ అన్నారు. పంట‌ల బీమా, బోన‌స్, రైతు భ‌రోసా అన్నారు ఏది లేదు. రైతు డిక్ల‌రేష‌న్‌ను కాట క‌లిపారు. నా ఇజ్జ‌త్ పోత‌ది చేస్త‌వా చేయ‌వా అని రాహుల్ రేవంత్‌కు మొట్టికాయ వేయ‌డం లేదు.. ఈయ‌న ఇచ్చే సంచుల కోసం ఆయ‌న పెద‌వులు మూసుకున్నాడు.

రైతుల‌కు ఎగ్గొట్టిన రైతు బంధు డ‌బ్బు 20 వేల కోట్లు..

రుణ‌మాఫీ చేస్తామ‌న్నారు.. మొద‌టి సంత‌కం దానిపైనే అన్నారు.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో దేవుడు క‌న‌బ‌డితే పాపం ఒట్టు పెట్టుడు.. పంద్రాగ‌స్టు వ‌ర‌కు పూర్తి చేస్తా అని 101 దేవుళ్ల మీద ఒట్టు పెట్టిండు. కానీ రుణ‌మాఫీ కాలేద‌ని రైతులు చెబుతున్నారు. న‌ల్ల‌గొండ జిల్లాలో 2 ల‌క్ష‌ల లోపు వ‌ర‌కు చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 40 శాతం రుణ‌మాఫీ అయింది.. 60 శాతం ఎగ‌బెట్టిండు. దీనిపై అసెంబ్లీలో నిల‌దీస్తే.. రుణ‌మాఫీకి రాం రాం అంటున్నారు. రేవంత్ వ‌చ్చాక నాలుగు రైతుబంధులు వ‌చ్చాయి.. ఒక్క రైతుబంధు బ‌రాబ‌ర్ వేశారు. మిగ‌తా మూడుసార్లు ఎగ్గొట్టారు. రైతుల‌కు ఎగ్గొట్టిన రైతు బంధు డ‌బ్బు 20 వేల కోట్లు.. ఈ డ‌బ్బుల‌తో రుణ‌మాఫీ చేసిండు అని అంటున్న‌డు.. రైతుల‌కు ఇచ్చింది గుండు సున్నా.. అన్ని పంట‌ల‌కు బోన‌స్ అన్నారు.. కానీ స‌న్నాల‌కు ఇస్తున్నారు. బోన‌స్ మాట బోగ‌స్ అయిపోయింది.. పంట‌ల బీమా కూడా నెర‌వేర‌లేదు. రైతాంగానికి ఇచ్చిన ఏ ఒక్క మాట నిలుపుకోలేదు రేవంత్ ప్ర‌భుత్వం.

50 వేల ఎక‌రాల‌కు నీళ్లిచ్చాం..

కేసీఆర్ హ‌యాంలో చెరువులను త‌వ్వేందుకు మిష‌న్ కాక‌తీయ చేప‌ట్టారు. నాగార్జున సాగ‌ర్ లో లెవ‌ల్ కెనాల్ పూర్తి చేసి 50 వేల ఎక‌రాల‌కు నీళ్లిచ్చాం. లిఫ్ట్‌ల‌న్నీ బాగు చేసి నీరందించాం. రైతుల కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేశాం. కానీ ఈ ప్ర‌భుత్వానికి రైతుల‌పై ప‌ట్టింపు లేదు.. కానీ క‌మిష‌న్ల కోసం ఎదురుచూస్తున్నారు.

అంత కక్కిద్దాం.. విడిచిపెట్టేది లేదు..

వ‌డ్డీతో స‌హా చెల్లిద్దాం.. పెట్టుకుంటే నాలుగు కేసులు పెట్టుకుంటారు.. ధైర్యంగా ఉండండి.. మ‌ళ్లీ వ‌చ్చేది బీఆర్ఎస్. ఇది కాంగ్రెసోళ్ల‌కే ఎక్కువ అర్థ‌మైంది. తిరుగుడు బంద్ చేసి స‌ర్దుకునుడులో ప‌డ్డారు. అంత కక్కిద్దాం.. విడిచిపెట్టేది లేదు. మిల్ల‌ర్ల‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుమ్మ‌క్క‌య్యారు. త‌క్ష‌ణ‌మే వ‌డ్ల కొనుగోళ్ల‌ను ఎలాంటి త‌రుగు లేకుండా చేప‌ట్టాలి. మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించండి.. లేదంటే బీఆర్ఎస్ ఉద్య‌మం చేస్త‌ది రైతుల ప‌క్షాన అని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement