త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | దేశ అభివృద్ధికి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర ఎంతో ముఖ్యం : కేటీఆర్

KTR | దేశాభివృద్ధికి ఛార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ పాత్ర ఎంతో ముఖ్య‌మని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాల్లో, దేశ ఆర్థిక ప్రగతిలో సీఏల పాత్ర మరింత పెరుగుతుంది అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On May 23, 2026, 3.43 pm IST

KTR | దేశ అభివృద్ధికి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర ఎంతో ముఖ్యం : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర. న్యూస్ : దేశాభివృద్ధికి ఛార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ పాత్ర ఎంతో ముఖ్య‌మని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాల్లో, దేశ ఆర్థిక ప్రగతిలో సీఏల పాత్ర మరింత పెరుగుతుంది అని ఆయ‌న పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) స్నాత‌కోత్స‌వానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్ర‌సంగించారు.

ప్రస్తుత దేశ ప్రగతిలో ఛార్టర్డ్ అకౌంటెంట్ల ప్రాధాన్యత పెరుగుతున్నది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కొత్తగా వచ్చిన పన్నుల నిబంధనలు, జీఎస్టీ (GST) వంటి కొత్త పన్నుల వ్యవస్థ వలన ఛార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర, పరిధి వేగంగా పెరుగుతున్నది. మరోవైపు ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ, వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడం, అందుబాటులోకి వస్తున్న ఆధునాతన టెక్నాలజీ వంటి అనేక అంశాల వలన సమాజంలో సీఏలకు అవసరం మరింత పెరిగిందన్నారు.

ప్రతి ఒక్క సీఏ విద్యార్థికి అభినందనలు..

15-20 సంవత్సరాల క్రితం సీఏ చదవడం, సీఏల అవసరం చాలా తక్కువగా ఉండేదని, అయితే సీఏ కోర్సులో ఉన్న కఠినత్వం వలన అనేకమంది సీఏ కోర్సు తీసుకోవడానికి వెనుకంజ వేసేవారు. అయితే, ఇంత కఠినమైన కోర్సును కూడా అత్యంత పట్టుదలతో అధిగమించిన ప్రతి ఒక్క సీఏ విద్యార్థికి అభినందనలు. ఛార్టర్డ్ అకౌంటెంట్ అంటే కావడం అంటే కేవలం పరీక్ష పాస్ అవ్వడం మాత్రమే కాదని, తీవ్రమైన ఒత్తిడిని, తీవ్రమైన అనిశ్చితిని తట్టుకొని చదివి, వైఫల్యాలను దాటుకొని ముందుకు సాగడం అని కేటీఆర్ అన్నారు.

వ్యాపారంతో పాటు స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది..

చాలామంది జీవితంలో వైఫల్యాలను, కష్టకాలాలను ఎదుర్కోలేక చేతులెత్తేస్తారని, అయితే ఈ కాన్వకేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క యువతీ, యువకుడు అత్యంత కఠినమైన కోర్సును పూర్తి చేసుకోవడం అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే ప్రతి ఒక్క సవాలును ధైర్యంగా ఎదుర్కోగలమని నిరూపించుకున్నారు. భారతదేశంలో ప్రస్తుతం వ్యాపారంతో పాటు స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగిందని, అనేక మంది యువత తమ సొంత వ్యాపార, వాణిజ్య అవకాశాలను సృష్టించుకునే దిశగా సాగుతున్నారు. అలాంటి వారందరికీ సీఏల యొక్క ఆర్థిక మార్గదర్శనం, మద్దతు అవసరం. ఒక రకంగా చెప్పాలంటే, రానున్న భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాల్లో, దేశ ఆర్థిక ప్రగతిలో సిఏల పాత్ర మరింత పెరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని కేటీఆర్ తెలిపారు.

ప్రభుత్వాలకు కూడా భారీగా ఆదాయం..

సీఏలు కేవలం పన్ను నిబంధనలను గురించి మార్గదర్శకత్వం చేసేవాళ్ళు మాత్రమే కాదని, వ్యాపారాలను బలోపేతం చేసేవాళ్ళు కూడా. వ్యాపార వాణిజ్యాలు పెరిగితే కేవలం ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా, ప్రభుత్వాలకు కూడా భారీగా ఆదాయం వస్తుందని, తద్వారా ప్రజల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కూడా చేయూత లభిస్తుంది. పరోక్షంగా సీఏలు చేసే సేవలు, వారి ద్వారా ప్రభుత్వాలకు లభించే ఆదాయం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందన్న అంశాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు.

'స్టార్టప్ స్టేట్' గా తెలంగాణ రాష్ట్రం

తెలంగాణ రాష్ట్రం దేశం చరిత్రలోనే అత్యంత విజయవంతమైన 'స్టార్టప్ స్టేట్' గా ఎదిగింది. 2014 నుంచి 2023 వరకు స్టేట్ ఓన్ టాక్స్ రెవెన్యూలు (State Owned Tax Revenues) 37 శాతం పైగా వృద్ధి చెందాయని, ఇది భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రంతో పోల్చుకున్నా అత్యధికం. దీనితో పాటు మొత్తం ఆదాయ అభివృద్ధి సుమారు 14 శాతం ఉంటే, అది 24 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తెలంగాణ ఏర్పడడానికి ముందు 94,000 ఉంటే, 2023 నాటికి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాలను దాటుకొని 3 లక్షల రూపాయలకుపైగా పెరిగింది. ఇక ఛార్టర్డ్ అకౌంటెంట్లు ప్రస్తుత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాల పైన కూడా దృష్టి సారించి, తమ వృత్తిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. క‌చ్చితంగా పెరుగుతున్న సాంకేతికత వలన మనిషి ఉత్పాదకత కూడా భారీగా పెరుగుతుందన్న నమ్మకం తనదని, ఖచ్చితంగా ప్రస్తుతం మారుతున్న వ్యవస్థలు, టెక్నాలజీ టూల్స్ వలన సీఏల పనితీరుకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. చివరగా, ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్న ప్రతి ఒక్క సీఏకి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్.. ఈ స్థాయికి రావడానికి వారి వారి తల్లిదండ్రులు చేసిన త్యాగాలను మరవకూడదని, మీ ఎదుగుదలలో వారి పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటూ ముందుకు సాగాలని కేటీఆర్ సూచించారు.

Advertisement
Advertisement