Satish Reddy | బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ కోసం ఏఐ బొమ్మలతో రేవంత్ ఎర..!
Satish Reddy | మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నది బ్యూటీఫికేషన్ కాదని.. అది లూటిఫికేషన్ అనేది మరోసారి స్పష్టమైంది అని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐ బొమ్మలు చూపెట్టి లూటిఫికేషన్ చేస్తున్నరు
ఇప్పటి దాకా డీపీఆర్ ఎందుకు రెడీ కాలేదు
ఆర్కిటెక్ట్‌తో డిజైన్లు గీయించలేదు..
ఏఐ ఫొటోలతోనే హంగామా చేస్తున్నారు
మూటలు నింపుకునే ఉద్దేశం తప్ప..
మూసీని బాగుచేసే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు
సర్కారుపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
Satish Reddy | త్రినేత్ర.న్యూస్ : మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నది బ్యూటీఫికేషన్ కాదని.. అది లూటిఫికేషన్ అనేది మరోసారి స్పష్టమైంది అని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షన్నర కోట్లు పెట్టి బ్యూటిఫికేషన్ చేస్తాం.. గాంధీ విగ్రహం పెడతామని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. గాంధీ విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కోసం ఇప్పటికే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఇన్విటేషన్ ఇచ్చింది. అలాగే శుక్రవారం రోజున వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే.. రాజ్‌నాథ్ సింగ్‌కు ఇచ్చిన ఇన్విటేషన్‌పై, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో సమావేశానికి ఇచ్చిన ఇన్విటేషన్‌పై రెండు వేర్వేరు బొమ్మలు ఉన్నాయని సతీష్ రెడ్డి తెలిపారు.
తాము పెట్టబోయే గాంధీ విగ్రహం ఇదేనంటూ కాంగ్రెస్ సర్కారు మొదట ఒక ఫొటో విడుదల చేసింది. ఇప్పుడు మరో ఫొటో విడుదల చేసింది. అయితే.. రెండు కూడా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తయారు చేసినవే. ఏ ఒక్క ఫొటో కూడా ఆర్కిటెక్ట్ రూపొందించినది కాదు. రాజ్‌నాథ్ సింగ్‌కు ఇచ్చిన ఇన్విటేషన్‌పై గోల్డ్ కలర్ డిజైన్, ఆ తర్వాత లైట్ బ్లూ కలర్ డిజైన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో డిజైన్ ఇచ్చారు. ఇలా పూటకో డిజైన్‌ను ఏఐ ద్వారా తయారు చేసి ప్రజల్లోకి వదులుతున్నారు తప్ప ఇప్పటి వరకు సర్కారు దీనిపై సీరియస్‌గా వర్కౌట్ చేసింది లేదు. ఇలాంటి ఇమేజ్‌లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా.. పైసా ఖర్చు లేకుండా.. కుప్పలు తెప్పలుగా తయారు చేయొచ్చు. అలాంటి దానికి లక్షన్నర కోట్లు అంటున్నారంటేనే వారి దురుద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు అని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు డీపీఆర్ తయారు చేయకుండా.. పేదల ఇండ్లు కూలుస్తూ.. అపార్ట్‌మెంట్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఏఐ ద్వారా ఫొటోలు తయారు చేసి.. వాటితో ప్రచారం చేసుకుని.. శంకుస్థాపనలు చేసి.. కాంట్రాక్టుల పేరుతో కమిషన్లు దండుకుని.. బడా వ్యాపారవేత్తలకు కోట్ల రూపాయల భూములు కట్టబెట్టి.. భారీగా కమిషన్లు పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళిక వేసిందనేది ఈ చర్య ద్వారా మరోసారి స్పష్టమైంది. మూసీ పేరుతో ఇప్పుడు జరుగుతున్న హంగామా అంతా.. కేవలం కాసుల కోసం తప్ప.. మూసీలో ఉన్న కంపును తొలగించాలనే కాన్సంట్రేషన్‌తో కానే కాదు అని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



