త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Passport | పాస్‌పోర్ట్ కోసం ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా ఫోన్‌లో అప్లై చేయ‌వ‌చ్చు..

Passport | పాస్‌పోర్ట్ పొందడం ఒకప్పుడు చాలా కష్టమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా ఉండేది. అపాయింట్‌మెంట్ బుకింగ్, ఫామ్‌లు నింపడం, డాక్యుమెంట్లు సమర్పించడం వంటి పనుల కోసం చాలామంది ఏజెంట్లు లేదా బ్రోకర్లను ఆశ్రయించి వేల రూపాయలు అదనంగా చెల్లించేవారు.

S

Technology | Published On Jun 4, 2026, 2.42 pm IST

Passport | పాస్‌పోర్ట్ కోసం ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా ఫోన్‌లో అప్లై చేయ‌వ‌చ్చు..
Advertisement

Passport | పాస్‌పోర్ట్ పొందడం ఒకప్పుడు చాలా కష్టమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా ఉండేది. అపాయింట్‌మెంట్ బుకింగ్, ఫామ్‌లు నింపడం, డాక్యుమెంట్లు సమర్పించడం వంటి పనుల కోసం చాలామంది ఏజెంట్లు లేదా బ్రోకర్లను ఆశ్రయించి వేల రూపాయలు అదనంగా చెల్లించేవారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రక్రియను చాలా సులభతరం చేసింది. పాస్‌పోర్ట్ సేవా యాప్ (ఎం పాస్‌పోర్ట్ సేవా) ద్వారా ఇంట్లో నుంచే మొత్తం ప్రక్రియను స్వయంగా పూర్తి చేసుకోవచ్చు. ఏజెంట్ల అవసరం లేదు, అదనపు ఖర్చు లేదు. కేవలం మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. పాస్‌పోర్ట్ అప్లికేషన్ ప్రక్రియలో ఎదురయ్యే కొన్ని సమస్యల కారణంగా ప్రజలు గతంలో బ్రోకర్లను ఆశ్రయించేవారు. అపాయింట్‌మెంట్ తేదీలు ఆలస్యంగా రావడం, ఫామ్ నింపేటప్పుడు తప్పులు చేస్తామనే భయం, పీఎస్‌కే (పాస్‌పోర్ట్ సేవా కేంద్రం) ఎక్కడ ఉందో తెలియకపోవడం, సమయం లేకపోవడం వంటి కార‌ణాల‌తో చాలా మంది బ్రోక‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు.

యాప్ ద్వారా ఇలా ద‌ర‌ఖాస్తు చేయ‌వచ్చు..

ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని బ్రోకర్లు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు అలాంటి అవసరం దాదాపు లేకుండా పోయింది. ఫోన్ ద్వారానే సుల‌భంగా పాస్ పోర్ట్‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ సేవ ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ చాలా మందికి దీనిపై అవ‌గాహ‌న లేదు. అందువ‌ల్ల ఫోన్ లో యాప్ ద్వారా పాస్ పోర్టుకు ఎలా అప్లై చేయాలి అన్న వివ‌రాల‌ను ఇలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో పాస్ పోర్టు సేవ అని సెర్చ్ చేసి అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇతర ప్రాథమిక వివరాలను నమోదు చేసి అకౌంట్ ను క్రియేట్ చేయాలి. కొత్త పాస్‌పోర్ట్ లేదా రీ-ఇష్యూ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు ఫామ్‌ను నింపాలి. యాప్‌లో స్టెప్-బై-స్టెప్ మార్గదర్శకాలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నేరుగా యాప్‌లోనే ఫీజు చెల్లించవచ్చు. సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్‌కే) లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ కేంద్రం ఎంచుకుని అందుబాటులో ఉన్న తేదీలు, సమయాల్లో అనుకూలమైన స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పాస్‌పోర్ట్ స్టేటస్ ట్రాకింగ్, సమీప కేంద్రాల వివరాలు, అవసరమైన సమాచారం వంటి అనేక సౌకర్యాలు కూడా యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

ఈ సూచ‌న‌లు పాటించాలి..

యాప్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఇంటి నుంచే మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చు. బ్రోకర్ల అవసరం లేకపోవడంతో డబ్బు ఆదా అవుతుంది. పారదర్శకమైన, సురక్షితమైన విధానం, అలాగే రియల్‌టైమ్ అప్‌డేట్లు అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు త్వరితగతిన అపాయింట్‌మెంట్‌లు కూడా లభించే అవకాశం ఉంటుంది. అయితే ఆధార్, పాన్, ఫోటో, ఇతర అవసరమైన పత్రాలను ముందుగానే స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఫామ్ నింపేటప్పుడు అన్ని వివరాలు సరైనవిగా, పత్రాల్లో ఉన్న సమాచారంతో సరిపోలేలా నమోదు చేయాలి. అపాయింట్‌మెంట్ రోజు పీఎస్‌కేకు వెళ్లేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. అవసరమైతే అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సందర్శించవచ్చు. ప్రతి పౌరుడికి మధ్యవర్తులు లేకుండా సులభంగా పాస్‌పోర్ట్ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే లక్షలాది మంది ఈ యాప్‌ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాస్‌పోర్ట్‌లు పొందారు. బ్రోకర్లకు వేల రూపాయలు చెల్లించే బదులుగా, పాస్‌పోర్ట్ సేవా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇంటి నుంచే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవ‌చ్చు. కొన్ని వారాల్లోనే కొత్త పాస్‌పోర్ట్‌ను చేతిలో పొందే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement