Manne Krishank | అక్రమ కేసులకు భయపడేది లేదు.. పోరాటం చేస్తూనే ఉంటాం : మన్నె క్రిశాంక్
Manne Krishank | రేవంత్ రెడ్డి పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలపై పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
Manne Krishank | త్రినేత్ర.న్యూస్ : రేవంత్ రెడ్డి పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలపై పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పోలీసు కస్టడీ అనంతరం జడ్జి ఎదుట హాజరు పరిచే ముందు మన్నె క్రిశాంక్ మాట్లాడారు.
రేవంత్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి.. తప్పుడు కేసులు పెడుతుంది. తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ మీద ఉపా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇవాళ మా మీద పదేండ్లు శిక్ష పడే సెక్షన్లు పెట్టారు. నిన్న జడ్జి కూడా రిమాండ్‌కు ఆదేశించలేదు. అయినా కూడా రాత్రంతా పోలీసు కస్టడీలో ఉంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ జడ్జి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తూ,
తమ ప్రాణాలు అర్పిస్తుంటే సమస్యలను పరిష్కరించడం లేదు. కేవలం మంత్రి సీతక్క అంగన్‌వాడీ టీచర్ల స్కాం గురించి సీబీఐ విచారణ కోరినందుకు ఇవాళ పదేండ్ల శిక్ష పడేలా ఉండే తప్పుడు సెక్షన్లు పెడుతుంది. కాంగ్రెస్ మంత్రుల అవినీతి, అరాచకాలను బయటపెడితే.. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో వేధిస్తున్నది అని మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
గురువారం అర్ధరాత్రి మారేడుపల్లిలోని క్రిశాంక్ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనతోసహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేందర్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



