త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | రేవంత్ రెడ్డి గారూ.. వైఎస్సార్ కోస‌మైనా ఆ ప‌థ‌కాన్ని కొన‌సాగించు : జీవ‌న్ రెడ్డి

Jeevan Reddy | రేవంత్ రెడ్డి గారూ.. కేసీఆర్ మీద కోపం ఉంటే.. వైఎస్సార్ కోస‌మైనా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని కొన‌సాగించాల‌ని బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తాటిప‌ర్తి జీవ‌న్ రెడ్డి కోరారు.

S

Telangana | Published On May 2, 2026, 6.21 pm IST

Jeevan Reddy | రేవంత్ రెడ్డి గారూ.. వైఎస్సార్ కోస‌మైనా ఆ ప‌థ‌కాన్ని కొన‌సాగించు : జీవ‌న్ రెడ్డి
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి గారూ.. కేసీఆర్ మీద కోపం ఉంటే.. వైఎస్సార్ కోస‌మైనా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని కొన‌సాగించాల‌ని బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తాటిప‌ర్తి జీవ‌న్ రెడ్డి కోరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జీవ‌న్ రెడ్డి శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

ఆర్ధిక వెనుకబాటు తనంలో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పథకం ప్రవేశ పెట్టారు. ఇంటర్ నుండి పోస్ట్ మెట్రిక్ చదివే వారికి లక్షలాది మంది విద్యార్థులకు బోధన కోసం ఈ పథకం ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ పథకం మరింత పటిష్టంగా అమలు చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఈ ప‌థ‌కం కొన‌సాగించారు. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఈ ప‌థ‌కం అమ‌లుకు నోచుకోవ‌డం లేదు అని జీవ‌న్ రెడ్డి మండిప‌డ్డారు.

గ‌తంలో ఆర్థిక భారం లేకుండా కాలేజీల్లో చ‌దివేవారు..

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధులు విడుద‌ల కాక‌పోవ‌డంతో.. స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ నిధుల కోసం యాజ‌మాన్యాలు కోర్టుకు వెళ్లాయి. విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి బ‌కాయిలు వ‌సూలు చేసుకోవాల‌ని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గ‌తంలో ఆర్థిక భారం లేకుండా కాలేజీల్లో చ‌దివేవారు. ఇప్పుడు ఈ ప‌థ‌కం అమ‌లు కాక‌పోవ‌డంతో.. విద్యార్థులు ఇబ్బంది ప‌డుతున్నారు.

ఎందుకు నీకు నిరుపేద వర్గాలు అంటే కక్ష..

రేవంత్ రెడ్డి.. ఎందుకు నీకు నిరుపేద వర్గాలు అంటే కక్ష. రాజ్యంగా నిబంధనలు పాటించడం నీ బాధ్యత కదా. విద్యా, వైద్యం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు. వైద్యానికి సంబంధించి కూడా ఆరోగ్య శ్రీని కేసీఆర్ మ‌రింత ప‌టిష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 33 జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు సూప‌ర్ స్పెషాలిటీ కాలేజీల‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో చేప‌ట్టిన‌ టిమ్స్ హాస్పిట‌ల్స్ కూడా త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయని జీవ‌న్ రెడ్డి తెలిపారు.

రేవంత్ రెడ్డికి అది సాధ్యం కాదు..

గత పాలన కంటే మెరుగైన పాలన కొనసాగించాలి. కాని రేవంత్ రెడ్డికి అది సాధ్యం కాదు. రైతు భరోసా రెండు దఫాలు ఎగొట్టారు. రుణమాఫీ 2 లక్షల లోపు చేస్తానని ఎగొట్టారు. రైతు పెట్టుబడి కూడా ఎగ్గొట్టారు. చదువు అనేది దేశ భవిష్యత్తు. తెలంగాణ ఏర్పాటుకు మూలం విద్యనే. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యా వైద్యం అందించాలని కేసీఆర్ ఆలోచన చేశారు. ఏమంత మెరుగైన పాలన అందిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి దొర. రేవంత్ ఏమన్నంటే ఫోర్త్ సిటీ తప్ప ఇంకోటి కనిపించదు, కనిపిస్తే హైడ్రా లేదా ఫోర్త్ సిటీ అని జీవ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు చేశారు.

రూ. 10వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి..

జీవో 7ను వెంటనే ఉపసంహరణ చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. గతంలో లాగా విద్యార్థులకు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ పథకం అమలు చేయాలి. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. నీవు ఇంకా రెండేళ్లు ఉంటావో.. నీ ప్రత్యర్థులు ఉంటారో.. కాంగ్రెస్ ప్రభుత్వంను భరించాలి. రూ. 10వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని జీవ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement