Revanth Reddy | రేవంత్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరాడు.. రాయబారిగా చంద్రబాబు
Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరాడు.. ఈ చేరికకు ఏపీ సీఎం చంద్రబాబు రాయబారిగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేత టీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరాడు.. ఈ చేరికకు ఏపీ సీఎం చంద్రబాబు రాయబారిగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేత టీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా జీవన్ రెడ్డి జగిత్యాలలో మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు నినదిస్తున్నారు.. నీ పాలన అంత మెరుగ్గా ఉంటే మరోసారి అధికారంలోకి వస్తా అంటున్నడు సీఎం. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అది కేసీఆర్ పుణ్యమే. అలాంటి ఆయనని పట్టుకొని ఊరి తీస్తాను అంటావా? ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి. వాస్తవాలు మాట్లాడుతుంటే.. దానికి భిన్నంగా విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు సీఎం. కేసీఆర్ జగిత్యాలకు వస్తున్నారని చెప్పి జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి మేడిగడ్డకు పోయారు అని ధ్వజమెత్తారు.
ఆంధ్రా నాయకుల చేతిలో కీలు బొమ్మ
రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకులకు తొత్తుగా, ఆంధ్రా నాయకుల చేతిలో కీలు బొమ్మలాగా మారాడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలో భాగంగా.. 2015లో ఇదే టీడీపీ నుండి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని చూసి, ఓటుకు నోటులో దొరికాడు. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి అని జీవన్ రెడ్డి సూచించారు.
నేనే రాజీనామా చేశాను..
నాదెండ్ల భాస్కరరావు అంశం గురించి రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఆనాడు నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. ఎన్టీఆర్ హయంలో నాదెండ్ల భాస్కర్ రావును మంత్రి పదవి నుండి తొలగించినప్పుడు, ఆయనకు మద్దతుగా నేను మంత్రి పదవిని రాజీనామా చేశాను. నన్నెవరూ మంత్రి పదవి నుండి తొలగించలేదు, నేనే రాజీనామా చేశాను. నేను మాత్రమే కాదు, ఆ రోజు ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం నాదెండ్ల భాస్కర్ రావుకు మద్దతుగా నిలిచింది.. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదు అనుకుంటా అని మాజీ మంత్రి తెలిపారు.
ఎన్డీఏకు రేవంత్ రెడ్డికి వారధిగా చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమైతదో తెలియదు. ఈయన్నే సీఎంగా ఉంటా అని అనుకుంటుండు. అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పటికే బీజేపీలో చేరిండు. చంద్రబాబు రాయబారిగా ఉన్నాడు. ఎన్డీఏకు రేవంత్ రెడ్డికి వారధిగా చంద్రబాబు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయినట్టు కనబడుతున్నది. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన పార్టీ ఎందుకు సైలెంట్‌గా ఉంటుందో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



