త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం: కేటీఆర్‌

KTR | బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ దినోత్సం సంద‌ర్భంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుభాకాంక్ష‌లు తెలిపారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా.. పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భమ‌ని చెప్పారు.

G

Telangana | Published On Apr 27, 2026, 11.26 am IST

KTR | బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ దినోత్సం సంద‌ర్భంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుభాకాంక్ష‌లు తెలిపారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా.. పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భమ‌ని చెప్పారు. స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ .. సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశమ‌ని తెలిపారు. 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్ అని వెల్ల‌డించారు. బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదని, ఒక విప్లవమ‌న్నారు. పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు, అభిమానులు, నాయకులకు ఎక్స్ వేదిక‌గా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement