Warangal | కాంగ్రెస్ దుర్మార్గాలపై బీఆర్ఎస్ అద్భుత పోరాటం : హరీశ్‌రావు
Warangal | రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు, అరాచక పనులపై, దుర్మార్గాలపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. వరంగల్‌లో స్కాలర్‌షిప్స్ పంపిణీ, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి రెండున్నర యేండ్లు అవుతోందన్నారు.
Warangal | రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు, అరాచక పనులపై, దుర్మార్గాలపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. వరంగల్‌లో స్కాలర్‌షిప్స్ పంపిణీ, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి రెండున్నర యేండ్లు అవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నామని తెలిపారు. హైడ్రా చర్యలను ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తల అండదండలతోనే ఇంత అద్భుతంగా పోరాడుతున్నామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల కొండంత అండతో ప్రజా క్షేత్రంలో, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామని చెప్పారు.
పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసే కార్యకర్తల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషానిస్తుందని తెలిపారు. అలాంటి కార్యకర్తలకు ఎక్కడైనా సహాయం చేసే అవకాశం వస్తే తాను తప్పకుండా అక్కడ ఉంటానని తెలిపారు. కార్యకర్తలను కాపాడుకోవడం అంటే పార్టీని కాపాడుకోవడమేనని, కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వడం అంటే పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమేనని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసేలా ప్రయత్నిస్తానని చెప్పారు. కేసీఆర్ హయాంలో సామాజిక రుగ్మతలను దూరం చేశారని, సమాజంలో కేసీఆర్ గొప్ప మార్పు తెచ్చారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వల్ల బాల్య వివాహాలు ఈ రాష్ట్రంలో లేకుండా పోయాయని అన్నారు. చట్టాలు, పోలీసులు చేయలేని పనిని కేసీఆర్ ఒక స్కీమ్‌తో బాల్య వివాహాలను రూపుమాపారని తెలిపారు.
కేసీఆర్ హయాంలో ఇంటిదగ్గర ప్రసవాలు ఆగిపోయాయని ఆయన అన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13 వేల రూపాయలు, కేసీఆర్ కిట్టు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం వల్ల మాతా శిశు మరణాలు ఆగిపోయాయని తెలిపారు. న్యూట్రీషియన్ కిట్టు, కేసీఆర్ కిట్టు ఈ రెండు కిట్లతో తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. మాత శిశు మరణాలను తగ్గించింది కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్టు అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలను కేసీఆర్ పెట్టారని, వెయ్యికి పైగా కేసీఆర్ గురుకులాలు పెడితే విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో తగ్గడానికి కేసీఆర్ పెట్టిన గురుకుల పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాల వెనుక ఒక విజన్ ఉన్నదని ఆయన చెప్పారు. బతుకమ్మ చీరలు, రంజాన్ గిఫ్ట్, క్రిస్టమస్ గిఫ్ట్ తో పద్మశాలీలకు చేతినిండా పనిదొరికేదని తెలిపారు. చేనేత కార్మికులకు పని దొరకడం వల్ల ఆత్మహత్యలు ఆగిపోయాయని అన్నారు.
మిషన్ భగీరథతో ఈ రాష్ట్రంలో ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చారని, మిషన్ భగీరథతో ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ని పారదోలారని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులోని మట్టి పొలాల్లో వేసుకుంటే పొలం ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. చెరువులు నిండు కుండలా ఉంటే మత్స్యకారులు చేపలు పట్టుకునేవారని అన్నారు. ఇరిగేషన్ పథకం, చెక్ డ్యాంల వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయని చెప్పారు. ఒకప్పుడు అత్యధికంగా రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ ఉండేదని, కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలే లేని తెలంగాణగా మార్చారని అన్నారు. హిందూ, ముస్లింలను కేసీఆర్ సమ దృష్టితో చూశారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని చెప్పారు. తప్పకుండా మంచి రోజులు వస్తాయని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని పోరాడుతున్న కార్యకర్తల పిల్లల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషమని హరీష్ రావు తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి





