త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | రేవంత్‌కు ఆడ‌బిడ్డ‌ల ఉసురు త‌గులుతుంది : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

Kalvakuntla Kavitha | వెలుగుమ‌ట్ల బాధితుల ఆవేద‌న చూస్తే క‌డుపు త‌రుక్కుపోతోంద‌ని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఈ ఆడ‌బిడ్డ‌ల ఉసురు త‌గులుతుంద‌ని ఆమె మండిప‌డ్డారు.

S

Telangana | Published On Mar 9, 2026, 4.53 pm IST

Kalvakuntla Kavitha | రేవంత్‌కు ఆడ‌బిడ్డ‌ల ఉసురు త‌గులుతుంది : క‌ల్వ‌కుంట్ల క‌విత‌
Advertisement

రాష్ట్రంలో పేద‌ల‌పైనే జులుం
పెద్ద‌వాళ్ల బిల్డింగ్‌ల జోలికి వెళ్ల‌డం లేదు
రాత్రికి రాత్రే పేద‌ల ఇళ్ల‌ను కూల్చేశారు
బీఆర్ఎస్ నేత‌లు పాపాన్ని క‌డుక్కుంటున్నారు

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : వెలుగుమ‌ట్ల బాధితుల ఆవేద‌న చూస్తే క‌డుపు త‌రుక్కుపోతోంద‌ని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వానికి, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఈ ఆడ‌బిడ్డ‌ల ఉసురు త‌గులుతుంద‌ని ఆమె మండిప‌డ్డారు. వెలుగుమ‌ట్ల బాధితుల‌ను క‌లిసి వారితో మాట్లాడిన అనంత‌రం క‌విత మీడియాతో మాట్లాడారు.

బాధితుల ఇళ్లు కూల్చిన చోటే వారికి కొత్త ఇళ్లు కట్టివ్వాలి. రాష్ట్రంలో పేదలపై జులుం నడుస్తోంది. పెద్ద వాళ్ల బిల్డింగ్‌ల జోలికి వెళ్లటం లేదు. బాధితుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి పోరాటం చేస్తాం. ప్ర‌భుత్వానికి, నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుంది. ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదు. అలాంటిది ఇంత మంది ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది అని క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్‌గా మారింది..

పిల్లల ఎగ్జామ్స్ సమయంలో తల్లితండ్రులు ఎంతో ఆందోళనతో ఉంటారు. ఎగ్జామ్స్ సయమంలో పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేశారు. మీ ఇళ్లు కూల్చేస్తే చాలా మంది రాజకీయ నాయకులు ఎగ్జిబిషన్ చూసినట్లు చూసి వెళ్లారు. మీ ఆవేదన, బాధ కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్‌గా మారింది. నన్ను కూడా తొందరగా ఇక్కడకు వెళ్లు అని చాలా మంది చెప్పారు నేను ఎక్కడున్నా సరే మహిళలు, పేదల పక్షానే ఉంటా. ఒక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం వచ్చే వరకు వదలి వెళ్లాను. నేను ఏదో మిమ్మల్ని చూసి వెళ్లటానికి ఇక్కడకు రాలేదు. మీ సమస్యలు సావధనంగా విని...వాటిని ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించేందుకు వచ్చాను అని క‌విత తెలిపారు.

కనీసం మహిళలకు ప్రత్యేక వసతి లేదు..

మీతో పాటు ఇక్కడ విశారదన్ మహారాజ్ కూడా ఉన్నారు. ఆయన పట్టుపడితే వదలరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో పాటు జాగృతి కూడా మీకు తోడుగా ఉంది. ఒక పరిష్కారం వచ్చే వరకు కూడా మనం సమస్యను వదలకుండా పోరాటం చేద్దాం. మనల్ని ఓ కొట్టంలోకి తోలినట్లు ఇక్కడకు తీసుకొచ్చి పెట్టేశారు. కనీసం మహిళలకు ప్రత్యేక వసతి లేదు. హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కనీసం హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. గతంలో మన ఇళ్లు కూల్చేసే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్లు భోజనాలు, హెల్త్ క్యాంప్‌లు పెట్టారంట. మంచిదే వాళ్లు చేసిన పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకపోవటం దారుణం అని క‌విత మండిప‌డ్డారు.

అక్కడే కొత్తగా ఇళ్లు కట్టించి ఇవ్వాలి..

కలెక్టర్ ఒక్క రోజు కూడా రాలేదని చెబుతున్నారు. ముగ్గురు మంత్రులు ఈ జిల్లాకు ఉంటే ఒక్కరికి కూడా సోయిలేదు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఈ సమస్యపై మాట్లాడాలి. ముందుగా జిల్లా కలెక్టర్ ఇక్కడకు రావాలన్నది మన డిమాండ్ అదే విధంగా మన ఇళ్లు ఎక్కడ నేలమట్టం చేశారో... అక్కడే కొత్తగా ఇళ్లు కట్టించి ఇవ్వాలి. వేరే చోటకు వెళ్లమంటే వెళ్లేది లేదు. ఇక్కడే ఇళ్లు కట్టించేలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాష్ట్రం మొత్తం కూడా పేదల మీద జులుం నడుస్తోంది. పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపుతూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. పెద్ద వాళ్ల బిల్డింగ్‌ల జోలికి వెళ్లటం లేదు. వాళ్ల బిల్డింగ్‌లు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగాన్ని కూనీ చేసేలా పేదల మీదకు బుల్జోజర్లు వస్తున్నాయి. దానిని ఎదిరించి మీ పక్షాన నిలిచేందుకే ఇక్కడకు వచ్చాం. మనందరం కలిసి ఓ కార్యాచరణ రూపొందించుకొని పరిష్కారం కోసం ప్రయత్నిద్దాం అని క‌విత పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement