Peddi Sudarshan Reddy | రేవంత్ రెడ్డి 420 ముఖ్యమంత్రి : పెద్ది సుదర్శన్ రెడ్డి
Peddi Sudarshan Reddy | రేవంత్ రెడ్డి 420 ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
Peddi Sudarshan Reddy | త్రినేత్ర.న్యూస్ : రేవంత్ రెడ్డి 420 ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయలేదు. రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్‌ను ఇరికించాలని భావించారు. రాజకీయ దుష్ప్రచారం కోసం కాళేశ్వరం కమీషన్ రిపోర్టును రేవంత్ రెడ్డి వాడుకున్నారు అని పెద్ది ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో మొక్క జొన్న పంట కొనే దిక్కు లేదు. మొక్క జొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. లక్షలాది మంది మొక్కజొన్న రైతులను నిండా ముంచుతున్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రైతులు ప్రయివేటు వ్యాపారుల వద్ద మోసపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మార్క్ ఫెడ్ సంస్థను కుదువపెట్టి రూ. 22 వేల కోట్ల అప్పు తెచ్చారు. మార్క్ ఫెడ్ కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్నలకు ఎట్లా చెల్లింపులు చేస్తారు. కేసీఆర్‌ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లాగా మార్క్ ఫెడ్‌లో దందాలు చేశారని సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు.
టెస్కో ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు బట్టలు సప్లై చేసేవారు. టెస్కోలో 50 వేల మంది సభ్యులు ఉన్నారు. టెస్కో సప్లై ఆర్డర్ జీబో నంబర్ 1ను రద్దు చేసి రాజేష్ కార్పోరేషన్‌కు టెండర్లు దక్కే విధంగా చేశారు. రాజేష్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన సంస్థ. దీనిపై హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. ప్రభుత్వం పిచ్చి నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీని ఇక నుంచి వదిలి పెట్టం అని పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



