త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nannapuneni Narender | మ‌రి ఎవ‌డ్రా జాతిపిత‌.. నువ్వా..? నీ అల్లుడా..? నీ బిడ్డ‌నా..? క‌డియంపై న‌న్న‌పునేని ఫైర్

Nannapuneni Narender | చావునోట్లో త‌ల‌పెట్టి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ జాతిపిత కాక‌పోతే.. మ‌రి ఎవ‌డ్రా జాతిపిత అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ప్ర‌శ్నించారు. జాతిపిత నువ్వా..? నీ అల్లుడా..? నీ బిడ్డ‌నా..? రేవంత్ రెడ్డినా..? అని ఆయ‌న నిల‌దీశారు.

S

Telangana | Published On Feb 20, 2026, 5.18 pm IST

Nannapuneni Narender | మ‌రి ఎవ‌డ్రా జాతిపిత‌.. నువ్వా..? నీ అల్లుడా..? నీ బిడ్డ‌నా..? క‌డియంపై న‌న్న‌పునేని ఫైర్
Advertisement

Nannapuneni Narender | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌పై ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ తీవ్రంగా స్పందించారు. చావునోట్లో త‌ల‌పెట్టి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ జాతిపిత కాక‌పోతే.. మ‌రి ఎవ‌డ్రా జాతిపిత అని న‌రేంద‌ర్ ప్ర‌శ్నించారు. జాతిపిత నువ్వా..? నీ అల్లుడా..? నీ బిడ్డ‌నా..? రేవంత్ రెడ్డినా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మ‌హాత్మాగాంధీ ముందుండి కొట్లాడారు.. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం కేసీఆర్ కొట్లాడారు. అందుకే ఆయ‌న‌కు తెలంగాణ ప్ర‌జ‌లు జాతిపిత అనే బిరుదు ఇచ్చార‌ని న‌న్న‌పునేని న‌రేంద‌ర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో న‌న్న‌పునేని న‌రేంద‌ర్ మీడియాతో మాట్లాడారు.

నువ్వు మోస‌కారివి, ద్రోహి అయినా కూడా డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు కేసీఆర్. అయినా నీ కుట్ర మానుకోలేదు. అందుకే రెండోసారి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వి కోసం ఇత‌రుల‌ను తిడితే నీకు మంత్రి ప‌ద‌వి రాదు. నిన్ను కాంగ్రెస్ పార్టీలో దేక‌రు. నీ నిజ‌స్వ‌రూపం అంద‌రికీ తెలిసిపోయింది అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మంత్రి ప‌ద‌వి కోసం కేసీఆర్‌ను తిడుతున్నావా..?

ప‌దేండ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావ్. కేబినెట్‌లో ఉన్నావ్.. ఆ రోజు నీ నోటితో కేసీఆర్‌ను చాలా గొప్ప‌గా పొగిడిన‌వ్. కేసీఆర్ విశిష్ట‌మైన వ్య‌క్తి, మ‌హ‌నీయుడు అని చెప్పావ్. ఇవాళ్నేమో మంత్రి ప‌ద‌వి కోసం కేసీఆర్‌ను తిడుతున్న‌వ్. తెలంగాణ నీదా.. నీ కుటుంబానిదా.. నీ అయ్యాదా అన్న‌వ్.. మ‌రి మీ అయ్య‌దా.. రేవంత్ రెడ్డిదా ఎవ‌నీ అయ్య‌ది..? ఎవ‌రు జాతి పిత అంటున్న‌వ్.. మ‌రి ఎవ‌ర్రా జాతిపిత నువ్వా.. నీ అల్లుడా.. నీ బిడ్డా.. రేవంత్ రెడ్డినా జాతిపిత‌..? ఉద్య‌మ స‌మ‌యంలో ఏకే47తో పిల్ల‌ల‌ను కాల్చేందుకు ప‌య‌త్నించినా రేవంత్ రెడ్డినా..? జై తెలంగాణ అన‌ని నువ్వా..? ఆంధ్రా నుంచి వ‌చ్చినా నీ అల్లుడా..? నీ బిడ్డానా..? ఎవ‌రు జాతిపిత అని న‌న్న‌పునేని ప్ర‌శ్నించారు.

తెలంగాణ ప్ర‌జ‌లు ఇచ్చిన‌ బిరుదు అది..

చావునోట్లో త‌ల‌పెట్టి, 14 ఏళ్లు క‌ష్ట‌ప‌డి, ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారు. ప‌దేళ్లు తెలంగాణ‌ను సుభిక్షంగా ఉంచారు. స్వాతంత్య్ర ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించిన గాంధీని ప్ర‌జ‌లు జాతిపిత అన్నారు. తెలంగాణ ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించిన కేసీఆర్‌ను జాతిపిత అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఇచ్చిన‌ బిరుదు అది. కేసీఆరే తెలంగాణ జాతిపిత‌. ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడితే ఊరుకోం అని నన్న‌పునేని హెచ్చ‌రించారు.

కేసీఆర్ ఎవ‌రెస్టు శిఖ‌రం లాంటోడు..

వ‌రంగ‌ల్ జిల్లాలో ద‌ళితుల‌కు అన్యాయం చేశావ్. ఒంటెద్దు పోక‌డ‌తో ఎంతో మంది ద‌ళితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయించావ్. నీకు 40 ఎక‌రాల భూమి ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది..? గోదాంలు, పెట్రోల్ బంక్‌లు ఎలా వ‌చ్చాయి..? రెడ్‌మిక్స్ ఇండ‌స్ట్రీ ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది..? ఐదు కోట్ల విలువ చేసే ఇల్లు ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది..? నీవు నీతిగ‌ల్ల వ్య‌క్తివా..? నీకు నీవు పొగుడుకుంటే స‌రిపోత‌దా..? నీ స్థాయి చాలా చిన్న‌ది.. కేసీఆర్ ఎవ‌రెస్టు శిఖ‌రం లాంటోడు. కేసీఆర్‌ను పల్లెత్తు మాట అన్న వ‌రంగ‌ల్ జిల్లాలోనే బుద్ధి చెప్తామ‌ని మాజీ ఎమ్మెల్యే న‌రేంద‌ర్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement