త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollam Mallaiah Yadav | చ‌రిత్ర‌కే కాదు.. ఎన్టీఆర్‌కే అవ‌మానం.. సీఎం రేవంత్ వ్యాఖ్య‌ల‌పై బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ ఫైర్

Bollam Mallaiah Yadav | కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పోరాడిన ఎన్టీఆర్ గురించి.. అదే కాంగ్రెస్ జెండా కింద నిల‌బ‌డి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ‌డం చ‌రిత్ర‌కే కాదు.. ఎన్టీఆర్‌కే అవ‌మానం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ మండిప‌డ్డారు.

S

Telangana | Published On May 29, 2026, 2.40 pm IST

Bollam Mallaiah Yadav | చ‌రిత్ర‌కే కాదు.. ఎన్టీఆర్‌కే అవ‌మానం.. సీఎం రేవంత్ వ్యాఖ్య‌ల‌పై బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ ఫైర్
Advertisement

Bollam Mallaiah Yadav | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పోరాడిన ఎన్టీఆర్ గురించి.. అదే కాంగ్రెస్ జెండా కింద నిల‌బ‌డి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ‌డం చ‌రిత్ర‌కే కాదు.. ఎన్టీఆర్‌కే అవ‌మానం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ మండిప‌డ్డారు. నిన్న మైత్రివ‌నం జంక్ష‌న్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ సంద‌ర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విమ‌ర్శించిన సీఎం రేవంత్‌పై మ‌ల్ల‌య్య యాద‌వ్ నిప్పులు చెరుగుతూ ట్వీట్ చేశారు.

ప్రాంతీయ ఆత్మగౌరవానికి రాజకీయ రూపం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్

నాడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల రాజకీయ అహంకారాన్ని సవాలు చేస్తూ, తెలుగువాడి ఆత్మగౌరవ జెండాను ఎగరేసిన మహానేత అన్న ఎన్టీఆర్. కాంగ్రెస్ అనే పార్టీని ఎదురించి, ప్రాంతీయ ఆత్మగౌరవానికి రాజకీయ రూపం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. అలాంటి మహానేత పేరు చెప్పే ముందు, ఆయన ఏ సిద్ధాంతం కోసం పోరాడారో ఒకసారి గుర్తు చేసుకో గుంపు మేస్త్రి? నాడు అన్నగారు ఏ కాంగ్రెస్ పెత్తనానికి, ఏ రాజకీయ అరాచకత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేశారో, నేడు అదే కాంగ్రెస్ జెండా కింద నువ్వు నిలబడి అన్నగారి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం చరిత్రకే కాదు అన్నగారికే అవమానం అని మ‌ల్ల‌య్య యాద‌వ్ పేర్కొన్నారు.

అన్నగారి పేరు ఎత్తే నైతిక హక్కు నీకు ఎక్కడిది?

మన భాష, సంస్కృతి, మన ఆత్మాభిమానాన్ని జాతీయ పార్టీలు పట్టించుకోవు కాబట్టి, ఆ జాతీయ పార్టీల నాయకత్వంలో మనం బతకాల్సిన అవసరం లేదని, అన్నగారు ముక్తకంఠంతో చాటిన మాటలను నీకు గుర్తు చేస్తున్నా? ఆయన నమ్మిన ఆత్మగౌరవ రాజకీయాలను ఆచరించాలి.. అంతేగానీ, ఢిల్లీ ముందు మోకరిల్లుతూ.. తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడుతూ.. అన్నగారి పేరు ఎత్తే నైతిక హక్కు నీకు ఎక్కడిది? అని నిల‌దీశారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించిన నాయకుడు కేసీఆర్

అన్నగారిని గురువుగా భావించిన కేసీఆర్ గారు.. అదే కాంగ్రెస్‌పై ఎన్నో ఏళ్ళు నిరంతరం పోరాడి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించిన నాయకుడు! తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని, చరిత్రలో శాశ్వతంగా నిలిపిన మహా ఉద్యమకారుడు కేసీఆర్. అన్న ఎన్టీఆర్, కేసీఆర్ గారి సిద్ధాంతాలు వేరైనా, జాతీయ పార్టీల కబంధ హస్తాల నుంచి ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని కాపాడటమే, వారి అసలు సిసలైన లక్ష్యం! అని మ‌ల్ల‌య్య యాద‌వ్ పేర్కొన్నారు.

మోసపూరిత మాటలతో చరిత్రను దొంగిలించలేవు గుంపు మేస్త్రీ

విగ్రహాలు కట్టడం కాదు, వారి ఆశయాలను సాధించేలా ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం వారసత్వం. రాజకీయ అవసరాలకు వారి పేర్లు వాడుకోవడం కాదు, వారి విలువలను నిలబెట్టడం నిజమైన నివాళి! మోసపూరిత మాటలతో చరిత్రను దొంగిలించలేవు గుంపు మేస్త్రీ అని సీఎం రేవంత్‌పై మ‌ల్ల‌య్య యాద‌వ్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement