త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | నీవు వెయ్యి జ‌న్మ‌లు ఎత్తినా.. నేను చావ కొడుకా : కేసీఆర్

KCR | నీవు వెయ్యి జ‌న్మ‌లు ఎత్తినా.. నేను చావ కొడుకా అని కాంగ్రెస్ నేత‌ల‌ను ఉద్దేశించి గులాబీ బాస్ కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ వెధ‌వ‌లు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చ‌స్త‌డా అని బీఆర్ఎస్ అధినేత ఆవేశంగా మాట్లాడారు.

S

Telangana | Published On Apr 20, 2026, 9.54 pm IST

KCR | నీవు వెయ్యి జ‌న్మ‌లు ఎత్తినా.. నేను చావ కొడుకా : కేసీఆర్
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : నీవు వెయ్యి జ‌న్మ‌లు ఎత్తినా.. నేను చావ కొడుకా అని కాంగ్రెస్ నేత‌ల‌ను ఉద్దేశించి గులాబీ బాస్ కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ వెధ‌వ‌లు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చ‌స్త‌డా అని బీఆర్ఎస్ అధినేత ఆవేశంగా మాట్లాడారు. జ‌గిత్యాల స‌భ‌లో జీవ‌న్ రెడ్డి పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగించారు.

ఉట్టి మాట‌లు మాట్లాడడం కాకుండా.. గ‌ప్పాలు కొట్ట‌కుండా.. స‌భ‌లో నిల‌వ‌డి ఈ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఈ ఐదేండ్ల‌లో మిష‌న్ భ‌గీర‌థ పూర్తి చేసి న‌ల్లా పెట్టి మంచీనీళ్లు ఇవ్వ‌క‌పోతే మ‌ళ్లీ నిల‌బ‌డం అని చెప్పి సీఎం ఎవ‌రైనా ఉన్నారా..? నేను అసెంబ్లీలో చెప్పిన‌ట్టు 100 శాతం నీళ్లు ఇచ్చాం. నీళ్లు పుష్క‌లంగా వ‌చ్చాయి.. మ‌రి ఇప్పుడు ఏం రోగం పుట్టింది. ఎందుకు కుటుంతుంది. ఎందుకు నీళ్లు వ‌స్త‌లేవు.. మ‌రి ఏం చేయాలి.. లాగులు ప‌గిలేదాకా చంపాలి. క‌ట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి.. ఐదేండ్లు న‌డిచింది క‌దా.. ఏం బీమారి వ‌చ్చింది... ఇంతింత పొడువు అడ్డం పొడ‌వు మాట్లాడుతారా కేసీఆర్ చావాలి..నీవు వెయ్యి జ‌న్మ‌లు ఎత్తినా నేను చావ కొడుకా.. పిల్లి శాప‌నార్థాల‌కు ఉట్టి తెగుత‌దా..?

ఈ వెధ‌వ‌లు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చ‌స్త‌డా మీ దీవెనలు ఆశీర్వ‌చ‌నాలు ఉంటే.. నేను ఒక్క‌టే చెబుతున్నా.. ఇక్క‌డ ద‌రిద్య్రం పోయేదాకా, సంతోషంగా ఉండేదాకా సేవ చేయాల్సిందే.. చివ‌రి శ్వాస దాకా చేయాల్సిందే త‌ప్ప‌నే త‌ప్ప‌దు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement