MP Kirankumar Reddy | బీజేపీ చిల్లర రాజకీయాలు బంజేయాలే
MP Kirankumar Reddy | రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేస్తున్న కర్ణాటక బీజేపీ, దేశ బీజేపీ వారియర్స్ చిల్లర రాజకీయాలు బంజేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
- రాహుల్ జనాల మధ్య నడవాలనుకుంటరు
- డీకే శివకుమార్‌ను తోసింది ఉద్దేశపూర్వకంగా కాదు
- జనహిత యాత్రను చూసి ఓరుస్తలేరు
- రాహుల్ గాంధీపై చేస్తున్న దుష్ప్రచారంపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి రియాక్ట్
MP Kirankumar Reddy | త్రినేత్ర న్యూస్: రాహుల్ గాంధీపై దుష్ప్రచారం చేస్తున్న కర్ణాటక బీజేపీ, దేశ బీజేపీ వారియర్స్ చిల్లర రాజకీయాలు బంజేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. డీకే శివకుమార్‌ను కావాలని తోయలేదని.. రాహుల్ భద్రత సిబ్బంది బాధ్యతని అన్నారు. రాహుల్ జనాల మధ్య నడవాలని అనుకుంటారని.. ఏ లీడర్‌కైనా, ఏ పాపులర్ యాక్టర్‌కైనా యాత్రల సందర్భంగా వచ్చే సమస్యలు కామన్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు.
లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జనహిత యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని జ్ఞానేశ్ కుమార్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ చీప్ పాలిటిక్స్ చేస్తోంది. కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌ను రాహుల్ గాంధీ సెక్యూరిటీ తోసేశారని బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది. రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక బీజేపీ దుష్ప్రచారం మొదలు పెట్టింది.
రాహుల్ గాంధీ ర్యాలీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇండియా కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. సామాన్య కార్యకర్తలతో నడవాలని రాహుల్ గాంధీ అనుకుంటారు. సెక్యూరిటీ వాళ్లకు రాహుల్ గాంధీ భద్రత ముఖ్యం. అంతేగాని శివకుమార్‌ను ఏదో అవమానించారని కాదు. దీన్ని సోషల్ మీడియాల దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారు. ప్రతి ఒక్కలు ఆయన ఫ్రేమ్‌లో ఉండాలని కోరుకుంటారు. ప్రెగ్నెంట్ లేడీని తోసేశారని.. రాహుల్ గాంధీ పక్కకు జరిపారని అంటున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఏది చేయలేదు. కేవలం యాత్ర చేసేటప్పుడు జనాలను చూడాలనుకుంటడు. ఏ లీడర్‌కైనా, ఏ పాపులర్ యాక్టర్ కైనా ప్రజల మధ్య నడిచేటప్పుడు వచ్చే సమస్య ఇది. కర్ణాటక బీజేపీ, దేశ బీజేపీ వారియర్స్ చిల్లర రాజకీయాలు చేయొద్దు అని కిరణ్‌కుమార్ హితవు పలికారు.
తాజావార్తలు
- ●Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..
- ●Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు
- ●Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే
- ●Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..
- ●Giriraj Singh | 9 రాష్ట్రాల్లో 30 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు: గిరిరాజ్ సింగ్
- ●Gold And Silver Prices Today | ప్రపంచ బులియన్ మార్కెట్లలో జోరు.. ఈక్విటీ మార్కెట్లలో లాభాల ఎఫెక్ట్..

Delhi High Court | నిరసనల నియంత్రణకు ఎస్ఓపీలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..

Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గజగజ వణికిపోతుండు

Pooja Hegde | బుట్టబొమ్మ బర్త్‌డే ట్రీట్ - అచ్చ తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే

Godrej Consumer Products | వినియోగదారులకు షాకిచ్చిన గోద్రెజ్.. కన్స్యూమర్ ఉత్పత్తుల ధరలు పెంపు..




