త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | ఇక‌పై ఒంట‌రిగానే.. ద‌క్షిణాది రాష్ట్రాల‌పైనే మా ఫోక‌స్‌: అమిత్ షా

Amit Shah | వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణలో (Telangana) పోటీ చేస్తామ‌న్న జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు (Pawan Kalyan) బీజేపీ (BJP) షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అంతోఇంతో బ‌ల‌మున్న‌ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే త‌మ‌కు ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తున్న జ‌న‌సేనానికి ఇప్ప‌టికే రాజకీయాలు మొదలుపెట్టారు.

G

Telangana | Published On Jun 10, 2026, 11.49 am IST

Amit Shah | ఇక‌పై ఒంట‌రిగానే.. ద‌క్షిణాది రాష్ట్రాల‌పైనే మా ఫోక‌స్‌: అమిత్ షా
Advertisement

Amit Shah | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణలో (Telangana) పోటీ చేస్తామ‌న్న జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు (Pawan Kalyan) బీజేపీ (BJP) షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అంతోఇంతో బ‌ల‌మున్న‌ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే త‌మ‌కు ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తున్న జ‌న‌సేనానికి ఇప్ప‌టికే రాజకీయాలు మొదలుపెట్టారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ రోజునే తెలంగాణ మీ అయ్య జాగీరా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ప్ప‌క పోటీలో ఉంటుంది. నేనే స్వ‌యంగా రాష్ట్ర‌వ్యాప్తంగా తిరుగుతా అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ గొంతు చించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇక‌పై ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని, సొంతంగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశ‌ల‌కు గండికొట్టార‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. పొత్తు లేకపోతే ఏపీలో కానీ, తెలంగాణలో కానీ జనసేన పరిస్థితి గురించి ఇప్ప‌టికే పవనాలు చాలా సార్లు వెల్ల‌డించారు. రెండు రాష్ట్రాల్లో సింగిల్‌గా పోటీచేస్తే జ‌న‌సేన‌కైనా, ఏపీలో టీడీపీకైనా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. మరీ ముఖ్యంగా జనసేన పరిస్థితి దారుణంగా ఉండనుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇదే విష‌యాన్ని పవన్ స్వయంగా చాలా సార్లు చెప్పారని గుర్తుచేస్తున్నారు.

అమిత్ షా ఏమ‌న్నారంటే..

ఇక మీద‌ట ప్ర‌తి రాష్ట్రంలోనూ ఒంట‌రిగా పోటీ చేసి అధికారంలోకి రావాల‌న్న‌దే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని అమిత్ షా చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ‌, పంజాబ్‌ల‌లో ఒంట‌రిగా పోటీ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించామ‌ని వెల్ల‌డించారు.

ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ సొంతంగా పోటీ చేసి ఘ‌న విజ‌యం సాధించింది. అదేవిధంగా కేర‌ళ‌ల‌లోనూ త‌న బ‌లాన్ని పెంచుకున్న‌ది. ఇక త‌మిళ‌నాడులో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇక‌పై వీలైనంత వ‌ర‌కు ఇత‌ర పార్టీల‌తో పొత్తుల‌కు పోకుండా సొంతంగానే పోటీచేస్తామ‌ని, సొంత బ‌లంతోనే రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంద‌ని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement