త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Dharmapuri | ఎంపీ తేజస్వీ మాట్లాడిన దాంట్లో ఏ త‌ప్పూ లేదు : ధ‌ర్మ‌పురి అర‌వింద్

Arvind Dharmapuri | తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ స్పందించారు.

S

Telangana | Published On Apr 25, 2026, 4.07 pm IST

Arvind Dharmapuri | ఎంపీ తేజస్వీ మాట్లాడిన దాంట్లో ఏ త‌ప్పూ లేదు : ధ‌ర్మ‌పురి అర‌వింద్
Advertisement

Arvind Dharmapuri | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ స్పందించారు. బీజేపీ కార్యాల‌యంలో ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

ఎంపీ తేజ‌స్వీ సూర్య మాట్లాడిన దాంట్లో త‌ప్పేముంది. ఏం త‌ప్పుంది.. ఇండియా, పాకిస్తాన్ విభ‌జ‌న సంద‌ర్భంగా దేశం చాలా అత‌లాకుత‌ల‌మైంది. అన‌వ‌స‌రంగా వేలాది మంది చ‌నిపోయారు. ఇక్కడ కూడా 2009లో స్టేట్‌మెంట్ ఇచ్చి వెన‌క్కి తీసుకొని భ‌గ్గుమ‌న్న తెలంగాణ‌లో 2009 నుంచి 2014 మ‌ధ్య‌కాలంలో వంద‌లాది మంది యువ‌కులు ఆత్మ బ‌లిదానాలు చేశారు. 2009లోనే ఇచ్చేయొచ్చా క‌దా రాష్ట్రాన్ని. 2004లోనే మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి కాంగ్రెస్ రాగానే రాష్ట్రాన్ని ఇవ్వాలి. క‌నీసం 2009లో అయినా ఇవ్వాలి క‌దా.. రాజ‌శేఖ‌ర్ రెడ్డి చ‌నిపోయిన త‌ర్వాత సైలెంట్‌గా ఇచ్చేస్తే అయిపోతుండే. ఆ త‌ర్వాత జ‌రిగిణ ప‌రిణామాల నేప‌థ్యంలో స్టేట్‌మెంట్ ఇచ్చి రిట‌ర్న్ తీసుకున్నారు. దాంతో తెలంగాణ భ‌గ్గుమ‌ని వంద‌ల మంది చ‌నిపోయారు. ఈ ప్ర‌క్రియ‌ను ఎంపీ త‌ప్పుబ‌ట్టారు అని ధ‌ర్మ‌పురి అర‌వింద్ తెలిపారు.

Advertisement
Advertisement