MLA Ramana Reddy | కామారెడ్డికి నీ దరిద్రం పోతలేదు.. షబ్బీర్ అలీపై ఎమ్మెల్యే రమణారెడ్డి ఆగ్రహం
MLA Ramana Reddy | శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీపై కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తానే గెలిచానని విర్రవీగుతున్న ముసలి నక్క షబ్బీర్ అలీ అంటూ ఘాటుగా స్పందించారు. కామారెడ్డిలో బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
MLA Ramana Reddy | శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీపై కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తానే గెలిచానని విర్రవీగుతున్న ముసలి నక్క షబ్బీర్ అలీ అంటూ ఘాటుగా స్పందించారు. కామారెడ్డిలో బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీసారి ఎమ్మెల్సీ తనను గెలుకుతున్నాడని.. కొత్తవారికి అతని గురించి తెలియదని, తాను పాత బాకరనేనని వ్యాఖ్యానించారు. దొంగ సారా, దొంగ కట్టే అమ్ముకునే వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. తన తండ్రి దగ్గర శిష్యరికం చేశాడని, 1989లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వీడియోలు, ఫొటోలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత అని ప్రశ్నించారు. ఐదు అంతస్తుల భవనం కట్టాడని, ఫైర్ ఇంజిన్ కూడా తిరగదని ఆరోపించారు.
కామారెడ్డికి దరిద్రం పోతలేదు..
ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడో తెలుసనని.. నీకు హిందీ తప్ప తెలుగు రాదని, కామారెడ్డికి నీ దరిద్రం పోతలేదని, కామారెడ్డిలో ఐదుసార్లు ఓడిపోయావంటూ విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే గుడి, దర్గా, మసీదు వద్దకు భార్య పిల్లలతో రావాలని, తాను తనవాళ్లతో వస్తానంటూ సవాల్ విసిరారు. అరోరా కాలేజీకి తన తండ్రి గజం అమ్మినా తాను అరగుండు కొట్టించుకుని, మీసం లేకుండా తిరుగుతానని అన్నారు. షబ్బీర్ అలీ కామారెడ్డికి పట్టిన శని అని.. కామారెడ్డిలో కబ్జాలు పాల్పడ్డాడని.. తమ్ముడితో కలిసి భూకబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. రామారెడ్డి రోడ్‌లో ఎకరాల భూమిని బెదిరించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేసే సమయంలో తన వద్ద రూ.5లక్షలు తీసుకున్నాడన్నారు.
విగ్రహం పెట్టేందుకు రూ.2లక్షలు వసూలు..
ఆయన ఏం చేశాడో వెంట ఉన్న వారే చెప్పుకోలేకపోతున్నారని.. షబ్బీర్ అలీ ఓ దొంగ అని.. పక్కన పెట్టాలని సీఎం రేవంత్‌కు సూచించాననని, లేకపోతే నీ పేరు పోతుందని చెప్పానన్నారు. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అయినా బాగుపడ్డాడా? అని చెప్పాలని డిమాండ్ చేశారు. షాబాజ్ అనే వ్యక్తి తన పీఏనా అని ప్రశ్నిస్తూ.. సీఎంఆర్‌ఎఫ్‌కు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు. ఫోన్‌పే లిస్టు తీస్తే అన్ని తెలుస్తాయన్నారు. వరదల సమయంలో తాను ప్రజలతో ఉన్నానని, మీడియాను అడగాలని సూచించారు. ఇందిరా చౌక్‌లో విగ్రహం పెట్టడానికి రూ.2 లక్షలు వసూలు చేశాడని ఆరోపించారు.
ఈపులు సున్నం చేస్తా..
తాను తప్పు చేయలేదని, చేయనివ్వనన్నారు. తన తప్పు లేకపోయినా ఆరోపణలు చేస్తే ఈపులు సున్నం చేస్తానని హెచ్చరించారు. కొట్టడం, తిట్టడం రాజకీయం అయితే తాను చేస్తానని.. ఇక యుద్ధమేనన్నారు. ఒక్క అధికారి, నేతలు తప్పు చేసినా చర్యలుంటాయన్నారు. పోలీసులు తన వాహనాన్ని ఆపి చెక్ చేస్తున్నారని, తాను ఎమ్మెల్యేనన్నారు. ప్రజలంటే తనకు అభిమానం ఉందని, ప్రజలు 16 మందికి పట్టం కట్టారని అన్నారు. హిందువుల షబ్బీర్ వెంట సంక నాక్కుంటూ తిరుగుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంచితనం ఉన్న ఏ పార్టీ నేతలు నా సోదరి, అన్నలేనన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






