త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Harish Babu | రైతుకు రేవంత్ ఉరేస్తున్న‌డు : బీజేపీ ఎమ్మెల్యే హ‌రీశ్ బాబు

MLA Harish Babu | గత సీఎం కేసీఆర్ వ‌రి వేస్తే రైతుకు ఉరేసిన‌ట్టే అని అంటే.. ప్ర‌స్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా రైతుకు ఉరేస్తున్నాడ‌ని సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీశ్ బాబు మండిప‌డ్డారు.

S

Telangana | Published On May 29, 2026, 4.16 pm IST

MLA Harish Babu | రైతుకు రేవంత్ ఉరేస్తున్న‌డు : బీజేపీ ఎమ్మెల్యే హ‌రీశ్ బాబు
Advertisement

MLA Harish Babu | త్రినేత్ర‌.న్యూస్ : గత సీఎం కేసీఆర్ వ‌రి వేస్తే రైతుకు ఉరేసిన‌ట్టే అని అంటే.. ప్ర‌స్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏకంగా రైతుకు ఉరేస్తున్నాడ‌ని సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హ‌రీశ్ బాబు మండిప‌డ్డారు. రైతు గోస - బీజేపీ భ‌రోసా కార్య‌క్ర‌మంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే హ‌రీశ్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇస్తున్నా.. కనీసం ఆ ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంటే ఏంటో ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు అర్థ‌మైపోయింది. రైతు బంధుకు బంద్ పెట్టి రైతు భ‌రోసా ఇస్తా అన్నాడు. ఇచ్చిండా..? అంటే లేదు. మూడు కిస్తీలు ఇప్ప‌టికే ఎగ్గొట్టిండు. రెండు ఎక‌రాల‌కు మాత్ర‌మే రైతుభ‌రోసా వ‌చ్చింది. 45 రోజుల్లోపు అంద‌రికీ రైతు భ‌రోసా ఇస్తా అన్నాడు. ఈ మాట చెప్పి ఇప్ప‌టికీ రెండు నెల‌లైంది. కానీ ఇవ్వ‌లేక‌పోయిండు. ఇక గ‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా బాగానే మాట‌లు చెప్పేటోడు. వ‌రి వేస్తే రైతుకు ఉరి వేసిన‌ట్టే అన్న‌డు. ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి ప్ర‌త్య‌క్షంగా రైతుకు ఉరేసే కార్య‌క్ర‌మం చేస్తున్న‌డు. న‌ట్టేట ముంచుతున్న‌డు అని హ‌రీశ్ బాబు మండిప‌డ్డారు.

మ‌క్క‌లు, జొన్న‌లు, వ‌రి కొన‌లేని ఈ అస‌మ‌ర్థ ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టు స‌మాధానం చెప్పాలి. మ‌రో నాలుగు రోజుల్లో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌స్తున్నారు. ఆయ‌న వ‌చ్చోలోపు మ‌క్క‌లు, జొన్న‌లు, వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌ని ప‌క్షంలో ర‌హ‌దారుల దిగ్భంద‌నం చేస్తాం.. అప్పుడే ఈ ప్ర‌భుత్వం దిగివ‌స్తుంది. రైతన్నలకు ఒకటే హామీ ఇస్తున్నాం. మీరు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న, జొన్నలు, వడ్లు ప్రతి గింజనూ ఈ ప్రభుత్వం కొనుగోలు చేసేలా బిజెపి మీ పక్షాన పోరాడుతుంది అని బీజేపీ ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement